Shocking Video: బతికున్న కందిరీగను తిన్న యువకుడు.. నెక్స్ట్ అతడి తిప్పలు చూస్తే అయ్యో అనాల్సిందే..

Surya Kala

Surya Kala |

Updated on: Dec 30, 2022 | 7:01 PM

అసలే ఈ వీడియోలో ఓ యువకుడు బతికి ఉన్న పురుగులను పట్టుకుని తింటూ కనిపించాడు. అయితే చాప్ స్టిక్స్ తో పురుగుని పట్టుకుని.. దానిని కెమెరాకు చూపించాడు. అనంతరం ఆ పురుగుని నోటిలో పెట్టుకున్నాడు. అప్పుడు ఆ యువకుడి దీనావస్థకు ఎవరైనా అయ్యో అనాల్సిందే. ఎందుకో తెలుసా...

Shocking Video: బతికున్న కందిరీగను తిన్న యువకుడు.. నెక్స్ట్ అతడి తిప్పలు చూస్తే అయ్యో అనాల్సిందే..
Shocking Video

మన పెద్దలు మనిషి కర్మలకు సంబంధించి అనేక విషయాలను సామెతల రూపంలో తెలిపారు.అలాంటి సామెతలో ఒకటి.. మీరు ఇతరులకు ఏమి చేస్తే.. అదే మీకు ప్రతిఫలంగా దక్కుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సామెతకు సజీవ రూపంగా వీడియోలు పెట్టండి.. లైక్స్ ను సొంతం చేసుకోవడం నిలుస్తుంది. ప్రస్తుతం చాలామంది వయసుతో సంబంధం లేకుండా రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాము తినడం, తాగడం, నవ్వడం, డ్యాన్స్ వంటి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. లైక్స్ లో షేర్స్ తో హోరెత్తిస్తున్నారు. అయితే కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని తెప్పిస్తే… మరోకొన్ని నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది.

అసలే ఈ వీడియోలో ఓ యువకుడు బతికి ఉన్న పురుగులను పట్టుకుని తింటూ కనిపించాడు. అయితే చాప్ స్టిక్స్ తో పురుగుని పట్టుకుని.. దానిని కెమెరాకు చూపించాడు. అనంతరం ఆ పురుగుని నోటిలో పెట్టుకున్నాడు. అప్పుడు ఆ యువకుడి దీనావస్థకు ఎవరైనా అయ్యో అనాల్సిందే. ఎందుకో తెలుసా…

ఇవి కూడా చదవండి

ఆ యువకుడు చాప్‌స్టిక్‌తో బతికి ఉన్న ఒక పురుగుని పట్టుకున్నాడు. అది ప్రాణం కోసం కొట్టుకుంటూ రెక్కలను చప్పుడు చేస్తోంది.  అది కందిరీగలా ఉంది. అంతేకాదు కందిరీగ విషపూరితమైనది.  అయినప్పటికీ ఆ యువకుడు ఓ వైపు భయపడుతూనే మరోవైపు కందిరీగను నోట్లో పెట్టుకున్నాడు. అప్పుడు కందిరీగ అతడి నోటిని కుట్టునట్లు ఉంది. దీంతో ఆ యువకుడి నోరు బాగా ఉబ్బింది. చివరి వీడియోలో.. ఆ యువకుడు తన నోటిని వాచినట్లు చూపించాడు. విశేషమేమిటంటే.. ఇంట్లో ఇలా చేయవద్దని అందరికి సూచించాడు.

ఈ వీడియో @Instantregretss అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 36 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షకు పైగా వీక్షించగా, 2 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. రకరకాల కామెంట్స్ చేశారు.

‘ఇంట్లో ఇలా చేయడానికి ప్రయత్నించకపోవడమేమిటి. ఇలా ఎక్కడా ఎవరూ చేయవద్దు అని ఒకరు.. ఇలాంటి పనులు చేస్తే.. అందుకు తగిన శాస్తి జరిగిందని మరొకరు ‘మేము కీటకాలను తినకపోవడానికి ఇదే కారణం’ అని మరోకరు కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu