PM Modi: పంత్ కారు ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం.. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్
పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడడంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. రిషబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ' ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్‌కు జరిగిన సంఘటనతో నేను చాలా బాధపడ్డాను. అతని ఆరోగ్యం త్వరగా బాగుపడాలని ప్రార్థిస్తున్నాను ' అని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.
టీమిండియా యంగ్ క్రికెటర్ పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రూర్కీలో తన కుటుంబాన్ని కలవడానికి వెళుతున్న పంత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. తీవ్ర గాయాలత బయటపడిన పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంత్ ఆరోగ్య పరిస్థితిని నిత్యం పరిశీలిస్తున్నారు వైద్యులు. రిషబ్ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు కానీ అతని తీవ్రంగ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో తోటి ఆటగాళ్లే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు పంత్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. కాగా పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడడంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. రిషబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్‌కు జరిగిన సంఘటనతో నేను చాలా బాధపడ్డాను. అతని ఆరోగ్యం త్వరగా బాగుపడాలని ప్రార్థిస్తున్నాను ‘ అని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. కాగా ఇవాళ (డిసెంబర్ 30) ఉదయమే ప్రధాని మోడీ తల్లి హీరాబాను కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కాగా పంత్ ప్రయాణిస్తోన్న కారు ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. అయితే పంత్ వెంటనే బయటకు దూకి ప్రాణాలు తప్పించుకున్నాడు. అయితే పంత్ తల, వీపు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. పంత్ చికిత్సకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంది. కాగా పంత్ హెల్త్ పై బీసీసీఐ సెక్రటరీ జైషా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ బీసీసీఐ ఆధ్వర్యంలో రిషబ్‌కు అత్యుత్తమ వైద్య సంరక్షణ అందుతోంది. పంత్ కుటుంబ సభ్యులతో పాటు వైద్యులతో బీసీసీఐ నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. రిషబ్ కోసం నా ప్రార్థనలు. అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాను. మేం అతనికి పూర్తి సహకారం అందిస్తాం’ అని ప్రకటనలో తెలిపాడు జైషా.
Distressed by the accident of noted cricketer Rishabh Pant. I pray for his good health and well-being. @RishabhPant17
— Narendra Modi (@narendramodi) December 30, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..