Viral Video: మీ ఫోన్‌ నెంబర్‌ ఇస్తావా..? అంటూ నడిరోడ్డుపై మహిళను వేధించిన మందుబాబు.. ఆ తర్వాత సీన్‌ సితారే

మోతాదుకు మించి మద్యం తాగితే మనిషి మెదడు పనిచేయదు. కొన్నిసార్లు స్పృహ కోల్పోతాం. ఏం చేస్తుంటామో కూడా తెలియదు ఒకసారి. దీని వల్ల ఎన్నో పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Viral Video: మీ ఫోన్‌ నెంబర్‌ ఇస్తావా..? అంటూ నడిరోడ్డుపై మహిళను వేధించిన మందుబాబు.. ఆ తర్వాత సీన్‌ సితారే
Woman Beating Drunk Man
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2022 | 8:15 PM

మద్యం పుచ్చుకోవడం తప్పేం కాదు.. పండగ, పబ్బం, పార్టీలు..ఇలా కొన్ని సందర్భాలు, సమయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి మందు తాగాల్సిందే. అయితే అది లిమిట్‌లోనే. అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు.. అతిగా చేస్తే ఏదైనా అనర్థమే. మందు విషయంలో మరీనూ. మోతాదుకు మించి మద్యం తాగితే మనిషి మెదడు పనిచేయదు. కొన్నిసార్లు స్పృహ కోల్పోతాం. ఏం చేస్తుంటామో కూడా తెలియదు ఒకసారి. దీని వల్ల ఎన్నో పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు అవమానాలు పడాల్సి వస్తుంది. అందరిలో పరువు పోగోట్టుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక ఒక మహిళ ఫోన్‌ నంబర్‌ అడిగాడు ఒక వ్యక్తి. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై సదరు మహిళతో చెప్పు దెబ్బలు తని్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ ‘తగిన శాస్త్రి జరిగింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ధర్వాడా జిల్లాలోని శుభాష్‌ రోడ్డులో తూలుతూ కనిపించాడు. చుట్టుపక్కల ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారి ఫోన్‌ నంబర్లను అడుగుతూ తెగ ఇబ్బంది పెట్టాడు. కొందరు ఆ మందుబాబును పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. అయితే ఒక మహిళ మాత్రం కోపోద్రిక్తురాలైంది. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. మహిళకు సపోర్ట్‌గా నిలిచారు. తాగితే తాగావు కానీ ఫోన్ నంబర్ ఎందుకు అడుగుతున్నావంటూ అందరూ చివాట్లు పెట్టారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?