Viral Photo: ఇదేంట్రా అయ్యా.. ఒకే రూంలో నాలుగు టాయిలెట్లు..
ఇది చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు కలిసి ఒకేసారి మలవిసర్జనకు కూర్చుంటారంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారుల పనితీరుపై మండిపడుతున్నారు స్థానికులు.
![Viral Photo: ఇదేంట్రా అయ్యా.. ఒకే రూంలో నాలుగు టాయిలెట్లు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/four-toilet-seats.jpg?w=1280)
ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ్ భారత్ మిషన్ ఏస్థాయిలో నిర్వహించబడుతుందో నిరూపించే ఓ దృశ్యం సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతోంది. సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల ఆలసత్వం కారణంగా నిధులు నీటిపాలవుతున్నాయి. దీంతో సర్కార్ లక్ష్యానికి గండిపెడుతున్నారు కొందరు సిబ్బంది. కింది స్థాయి అధికారులు, కూలీలు కలిసి చేసిన ఓ తప్పిదం కారణంగా ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ నలుగురు కలిసి కూర్చునేందుకు వీలుగా ఒకే చోట మరుగుదొడ్డి ఏర్పాటు చేయటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఈ టాయిలెట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్‌లోని టౌన్‌షిప్‌లో స్వచ్ఛ్ భారత్ మిషన్ పథకం ద్వారా నిర్మించినట్టుగా తెలిసింది.
టౌన్‌షిప్ ప్రధాన కార్యాలయానికి 40 కిలోమీటర్ల దూరంలోని తహసీల్ రుదౌలీ ప్రాంతంలోని ధన్సా గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్. ఈ మరుగుదొడ్డి లోపల ఎలాంటి అడ్డుగోడ లేకుండా ఏకంగా నాలుగు టాయిలెట్ సీట్లు ఏర్పాటు చేశారు. ఇది చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు కలిసి ఒకేసారి మలవిసర్జనకు కూర్చుంటారంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారుల పనితీరుపై మండిపడుతున్నారు స్థానికులు.
ఎలాంటి తలుపులు, అడ్డుగోడలు లేకుండా నాలుగు టాయిలెట్ సీట్లు కలిపి ఏర్పాటు చేయడం పట్ల నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టౌన్‌షిప్‌లోని పంచాయతీరాజ్ శాఖలోని సమర్థులైన అధికారులు మాత్రమే ఇలాంటి ఘనత చేయగలరంటూ ఎద్దేవా చేస్తూ కామెంట్లు కుమ్మరిస్తున్నారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/10/tulasi-plant.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/healthy-sitting-habits.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/diabetes-8.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/12/rishabh-pant-accident.jpg)
ఈ మొత్తం వ్యవహారంలో, టౌన్‌షిప్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రాజేష్ ప్రజాపతి, రుధౌలీ బ్లాక్‌లోని ధన్సా గ్రామంలో ప్రమాణాల ప్రకారం మరుగుదొడ్డి నిర్మించలేదని, దాని కోసం జిల్లా పంచాయతీ రాజ్ అధికారిని విచారణకు ఆదేశించారు. నివేదిక మేరకు దోషులకు శిక్ష పడుతుందని హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి