Vastu Tips: తులసి మొక్క దగ్గర పొరపాటున కూడా ఇలాంటివి పెట్టకూడదు.. దాని తీవ్రత చాలా ఎక్కువ..
తులసి మొక్కకు ప్రతిరోజూ నీళ్లు పోసి సంరక్షించేవారిని లక్ష్మీదేవి కాటాక్షిస్తుందని అంటారు. అలాంటి తులసి వద్ద కొన్ని వస్తువులు పెట్టకూడదని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు..
తులసిని అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. అందువల్లే ప్రతి ఇంట్లోనూ మొక్కను నాటుకుని పూజిస్తారు. తులసికి పూజలు చేసి, నీళ్లతో నైవేద్యం పెట్టడం వల్ల అనేక రకాల అరిష్టాలు తొలగిపోయి, ఇంట్లో శుభాలు కలుగుతాయని చెబుతారు. శ్రీ మహా విష్ణువు, ఆ మహాలక్ష్మి దేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. తులసి మాత వద్ద కొన్ని తప్పనిసరి నియమాలను పాటించడం అవసరం. ఈ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందంటారు. అలాంటి వారు ధనవంతుడైనా సరే, పేదవాడికి మారడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. తులసి మొక్కకు ప్రతిరోజూ నీళ్లు పోసి సంరక్షించేవారిని లక్ష్మీదేవి కాటాక్షిస్తుందని అంటారు. అలాంటి తులసి వద్ద కొన్ని వస్తువులు పెట్టకూడదని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే లక్ష్మిదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం…
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క నాటిన ప్రదేశంలో మురికి వేయకూడదు. తులసి మొక్క దగ్గర ఎప్పుడూ పరిశుభ్రత పాటించాలి. రోజూ ఇంటి నుంచి బయటకు వచ్చే చెత్తను కూడా తులసికి దూరంగా ఉంచాలి. తులసి మొక్క దగ్గర చీపురు పెట్టకూడదు. ఇంట్లోని మురికిని శుభ్రం చేయడానికి చీపురు ఉపయోగించబడుతుంది. తులసి దగ్గర చీపురు పెడితే ఇంట్లో దరిద్రం తిష్టవేస్తుంది.
తులసి మొక్క నాటిన చోట లేదా ఉంచిన చోట బూట్లు, చెప్పులు పెట్టకూడదు. తులసి మొక్క పవిత్రతను గౌరవించండి. కొంచెం దూరంలో బూట్లు, చెప్పుల కోసం ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి. తులసి దగ్గర బూట్లు, చెప్పులు పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర ముళ్ల మొక్కలు నాటకూడదు. ముళ్ల మొక్కను నాటితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ మొదలవుతుంది. తులసి మొక్క చుట్టూ ముళ్లు ఉంటే వెంటనే తీసేయాలి.
మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.