AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: మానవత్వం ‘మంట’ కలిసింది.. పంత్‌ డబ్బులు, నగలు కాజేసిన జనాలు.. కారు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు

ప్రమాద సమయంలో కారు వద్దకి వచ్చిన కొందరు జనాలు, కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్‌ని కాపాడడానికి బదులుగా కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయినట్టు తెలుస్తుంది. అలాగే రిషబ్ ఒంటిపై ఉండే బంగారు గొలుసు, బ్రాస్‌లైట్ వంటి ఖరీదైన వస్తువులు కూడా అపహరణకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి.

Rishabh Pant: మానవత్వం 'మంట' కలిసింది.. పంత్‌ డబ్బులు, నగలు కాజేసిన జనాలు.. కారు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు
Rishabh Pant
Basha Shek
|

Updated on: Dec 30, 2022 | 3:57 PM

Share

టీమిండియా వికెట్ కీపర్ అండ్‌ డ్యాషింగ్‌ బాటర్‌ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురయ్యాడు. అతని కారు ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్దమైంది. అదృష్టవశాత్తూ పంత్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం డెహ్రడూన్ మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో కారు వద్దకి వచ్చిన కొందరు జనాలు, కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్‌ని కాపాడడానికి బదులుగా కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయినట్టు తెలుస్తుంది. అలాగే రిషబ్ ఒంటిపై ఉండే బంగారు గొలుసు, బ్రాస్‌లైట్ వంటి ఖరీదైన వస్తువులు కూడా అపహరణకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అయితే పంత్ కోలుకుని, ఈ విషయంపై నోరు విప్పితే కానీ అసలు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ రాదు. అయితే ఈ వార్తలు విని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మానవత్వం మంటగలిసేలా ప్రవర్తించారు’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులప పెడుతున్నారు.

ఆ తర్వాత రిషబ్ పంత్ కారు నుంచి అతి కష్టం మీద బయటికి వచ్చి అంబులెన్స్‌కి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. నిస్సహాయ స్థితిలో రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతంలో రిషబ్ పంత్ పడిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రిషబ్ పంత్‌ని గుర్తించిన మరికొందరు ప్రయాణీకులు మాత్రం అతనికి సాయం చేసి, పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. కాగా పంత్‌ను మొదట రూర్కీలోని సక్షం ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. పంత్ పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పంత్ గురించి మాట్లాడుతూ, అతనికి అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..