28 బంతుల్లోనే 78 రన్స్.. ఆపై 8వికెట్లు.. ఆల్ రౌండ్ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టిన సంజూ సంజూ స్నేహితుడు

టీ20 తరహా బ్యాటింగ్‌తో చేలరేగిన ఈయువ కెరటం కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. అంతేకాదు బంతితోనూ చెలరేగి మ్యాచ్‌ మొత్తంమీద 8 వికెట్లు నేలకూల్చాడు. తద్వారా రంజీ ట్రోఫీలో మొదటి విజయం సాధించాలన్న హైదరాబాద్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.

28 బంతుల్లోనే 78 రన్స్.. ఆపై 8వికెట్లు.. ఆల్ రౌండ్ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టిన సంజూ సంజూ స్నేహితుడు
Riyan Parag
Follow us

|

Updated on: Dec 30, 2022 | 5:08 PM

రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అస్సాం ఆటగాడు రియాన్‌ పరాగ్ చెలరేగాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో చేలరేగిన ఈయంగ్‌ ప్లేయర్‌ కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. అంతేకాదు బంతితోనూ చెలరేగి మ్యాచ్‌ మొత్తంమీద 8 వికెట్లు నేలకూల్చాడు. తద్వారా రంజీ ట్రోఫీలో మొదటి విజయం సాధించాలన్న హైదరాబాద్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్‌లో అస్సాం18 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. రవితేజ(4/53), కార్తికేయ(3/43)తో పాటు అజయ్‌ దేవ్‌ గౌడ్‌, త్యాగరాజన్‌, భగత్‌ వర్మ ఒక్కో వికెట్‌తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో అస్సాంను 205 పరుగులకే పరిమితం చేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఓపెనర్‌ రోహిత్‌ రాయుడు (60), భగత్‌ వర్మ (46) మాత్రమే రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 208 పరుగులు మాత్రమే చేసింది.

సెంచరీతో చెలరేగినా..

ఇక రెండో ఇన్నింగ్స్‌లో అస్సాం 252 పరుగులకు ఆలౌట్‌ కాగా.. లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ 61 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచిన హైదరాబాద్‌.. శుక్రవారం కార్తికేయ అవుట్‌ కావడంతో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (158 బంతుల్లో 126 నాటౌట్‌.. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌)ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టాడు రియాన్‌ పరాగ్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేయడం విశేషం. 8 వికెట్లు కూడా పటగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు. కాగా రియాన్‌ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో తన ఓవరాక్షన్‌తో విమర్శలు మూటగట్టుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..