AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Poorna: న్యూ ఇయర్‌ వేళ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రముఖ నటి.. త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న పూర్ణ

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రముఖ నటి పూర్ణ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ సొగసరి త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

Actress Poorna: న్యూ ఇయర్‌ వేళ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రముఖ నటి.. త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న పూర్ణ
Actress Poorna
Basha Shek
|

Updated on: Dec 31, 2022 | 11:13 AM

Share

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రముఖ నటి పూర్ణ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ సొగసరి త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇందులో తన కుటుంబసభ్యులతో శుభవార్తను పంచుకుంటూ సెలబ్రేషన్‌ చేసుకుంది. అనంతరం దీనినే తన ఇన్ స్టా స్టోరీలోనూ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌, నెటిజన్లు అభిమానులు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సినిమాలతో పాటు టీవీషోలతో బిజీగా ఉంటోన్న పూర్ణ రహస్యంగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌ 12న దుబాయ్‌ వేదికగా వ్యాపారవేత్త ఆసిఫ్‌ అలీతో పూర్ణ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా తన పెళ్లి విషయాన్ని నాలుగునెలల పాటు రహస్యంగా ఉంచిన పూర్ణ అక్టోబర్‌లో సోషల్‌ మీడియా ద్వారా ఈ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంది. తాజాగా తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించడంతో పూర్ణ దంపతులకు ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు, అభినందనలు చెబుతూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

2007లో విడుదలైన శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూర్ణ. ఆతర్వాత అల్లరి నరేశ్‌ సీమ టపాకాయ్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవును, అవును2, లడ్డూబాబు, నువ్విలా నేనిలా, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించి అక్కడి ఆడియెన్స్‌ అభిమానం పొందింది. ఇక ఢీ డ్యాన్స్‌ షోలో జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులకు అలరించింది. గతేడాది బాలయ్య అఖండ సినిమాలో నటించిన ఈ అందాల తార ఈ ఏడాది ఆది సాయికుమార్‌ తీస్‌మార్‌ఖాన్‌ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇక రాబోయే ప్రాజెక్టుల విషయానికొస్తే.. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న దసరా సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది పూర్ణ. ఇందులో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. అలాగే వ్రితం అనే మళయాల సినిమాలోనూ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!
F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!
ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!
ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!