LB Sriram: కొత్త గెటప్‌తో కేక పుట్టించిన ఎల్బీ శ్రీరామ్‌.. షార్ట్‌, గాగుల్స్‌తో కుర్రాడిలా మారిపోయిన సీనియర్ యాక్టర్

టీవల సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా మారిపోయారు ఎల్బీ శ్రీరామ్‌. తన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన అప్డేట్స్‌ను అందులో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం కానుకగా ఆయన ఓ స్పెషల్‌ పోస్ట్‌ చేశారు. ఇప్పుడదీ వైరల్‌గా మారింది.

LB Sriram: కొత్త గెటప్‌తో కేక పుట్టించిన ఎల్బీ శ్రీరామ్‌.. షార్ట్‌, గాగుల్స్‌తో  కుర్రాడిలా మారిపోయిన సీనియర్ యాక్టర్
Lb Sriram
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2023 | 1:14 PM

ఎల్బీ శ్రీరామ్‌..తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం లేని పేరు. కమెడియన్‌గా, రచయితగా, నిర్మాతగా డైరెక్టర్‌గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నారాయన. చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, ఆజాద్‌, హనుమాన్‌ జంక్షన్‌, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఆది, దిల్‌, ఛత్రపతి, ఎవడి గోల వాడిది, స్టాలిన్‌, సీమశాస్త్రి, గమ్యం, ఎవడు, లెజెండ్‌, సరైనోడు.. తదితర సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులుచ, పురస్కారాలు పొందారాయన. ఇటీవల సిల్వర్‌స్ర్కీన్‌పై అరుదుగా కనిపిస్తోన్న ఆయన అమృతం సీక్వెల్‌ అమృతం ద్వితీయం వెబ్‌ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఈ ఏడాది రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన కొండా చిత్రంలో కొండా కొమురయ్య పాత్రలో కనిపించారు ఎల్బీ శ్రీరామ్‌. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ బ్యానర్‌లో తెరకెక్కించిన కవి సామ్రాట్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవల సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా మారిపోయారు ఎల్బీ శ్రీరామ్‌. తన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన అప్డేట్స్‌ను అందులో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం కానుకగా ఆయన ఓ స్పెషల్‌ పోస్ట్‌ చేశారు. ఇప్పుడదీ వైరల్‌గా మారింది.

ఈ పోస్టులో మునుపెన్నడూ లేనంత స్టైలిష్‌గా కనిపించారు ఎల్బీ శ్రీరామ్‌. షార్ట్, కలర్‌ ఫుల్‌ షర్ట్‌, కూలింగ్‌ గ్లాసెస్‌తో స్టైలిష్‌ లుక్‌లో కనిపించారాయన. ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఆయన’ హాయ్‌ ఫ్రెండ్స్..హ్యాపీ న్యూ ఇయర్‌.. కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. నేను సినిమాల్లో ట్రై చేద్దామనుకుంటున్నాను. కొత్త కుర్రాణ్ణి కనుక కొత్త వేషాలేస్తున్నా’ అని తన స్టైలిష్‌ ఫొటోకు క్యాప్షన్‌ జోడించారీ సీనియర్‌ నటుడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సార్‌.. మీ కొత్త లుక్‌తో కేక పుట్టించేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by LB SRIRAM (@lb_sriram)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే