Raviteja: ఎమోషనల్ నోట్ షేర్ చేసిన మాస్ మాహారాజా.. ఈ ఏడాది చాలా కష్టంగా గడిచిందంటూ..

ధమాకా చిత్రం విడుదలై వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ భారీగా కలెక్షన్స్ రాబడుతూ.. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా.

Raviteja: ఎమోషనల్ నోట్ షేర్ చేసిన మాస్ మాహారాజా.. ఈ ఏడాది చాలా కష్టంగా గడిచిందంటూ..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2023 | 1:00 PM

మాస్ మాహారాజా రవితేజ ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు రూపొందించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ చిత్రం విడుదలై వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ భారీగా కలెక్షన్స్ రాబడుతూ.. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు రవితేజ.

ధమాకా విజయం తనకు ఓ మర్చిపోలేని సినిమాగా అందించడం ఆనందం కలిగించింది. ఈ సక్సెస్ ను గతేడాదిలో మనం కోల్పోయిన దిగ్గజాలకు అంకితం చేస్తున్నారు. ఈ ఏడాది ఎంతో కష్టంగా గడిచింది. కానీ మీ షరతులు లేని ప్రేమ నన్ను ముందుకు సాగేలా చేసింది. ఈరోజు మంచి.. రేపు సంవత్సరం కూడా బాగుంటుంది. అంటూ భావోద్వేగ నోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈసినిమా విడుదలైన ఎనిమిదిరోజుల్లోనే 69 కోట్లు వసూల్ చేసింది. 8 రోజుల్లో 69 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసి ధమాకా.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.