Puri Musings: ‘రేపటిలో ఆనందాన్ని వెతుక్కుంటూ బతకడం తప్పు కదా!.. ఈ క్షణమే ఎంజాయ్ చెయ్’.. పూరి జగన్నాథ్ కామెంట్స్.

భవిష్యత్తులో సంతోషంగా ఉంటామని వర్తమానంలో ఉన్న ఆనందాన్ని వదిలేస్తున్నామని..ఇప్పుడు... ఈ క్షణమే కాదు.. ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా ఆస్వాదించాలంటూ చెప్పుకొచ్చారు పూరి జగన్నాధ్.

Puri Musings: 'రేపటిలో ఆనందాన్ని వెతుక్కుంటూ బతకడం తప్పు కదా!.. ఈ క్షణమే ఎంజాయ్ చెయ్'.. పూరి జగన్నాథ్ కామెంట్స్.
Puri Musings
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2023 | 7:46 AM

సంతోషంగా ఉండాలంటే దాని ముందు ఓ చిన్న కష్టం కూడా ఉండాలి. ఎందుకంటే కష్టం తర్వాత సంతోషం వస్తుందని అందరికీ తెలుసు.. ఆనందాన్ని రేపటిలో వెతుకుంటున్నామని అన్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. భవిష్యత్తులో సంతోషంగా ఉంటామని వర్తమానంలో ఉన్న ఆనందాన్ని వదిలేస్తున్నామని..ఇప్పుడు… ఈ క్షణమే కాదు.. ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా ఆస్వాదించాలంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల పూరి మ్యూజింగ్స్ ద్వారా పలు విభిన్న అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త సంవత్సరం వేళ హ్యాపీ నౌ హియర్ గురించి నతదైన శైలిలో చెప్పుకొచ్చారు.

” మనందరి కోరిక ఒకటే ఆనందంగా ఉండటం. సంతోషంగా ఉండాలంటే దాని ముందు చిన్న కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టం తర్వాతే సంతోషం వస్తుందని మనందరికీ తెలుసు. అందుకే ఆ కష్టం కూడా మనమే క్రియేట్ చేసుకుని చింతిస్తూ ఉండడం అలవాటు చేసుకున్నాం. హమ్మయ్య రేపు మన కష్టాలు తీరిపోతాయి అనుకుంటాం. అంటే రేపటిలో మన ఆనందాలను వెతుక్కుంటాం. మన ఆనందాన్ని రేపటికి వాయిదా వేసినట్లే. వచ్చే సంవత్సరం కుమ్మేద్దాం అనుకుంటాం. మరి ఇప్పుడు ఈ క్షణం ఏమైంది ? నీకు దమ్ముంటే ఈరోజు కుమ్మేయ్. వచ్చే సంవత్సరం ఎందుకు. కొత్త సంవత్సరంలో కొన్ని తీర్మానాలు రాసి పెట్టుకుంటాం. జనవరి 1 నుంచి మందు మానేద్దాం.. పేకాట ఆపేద్ధాం.. ఉదయాన్నే నిద్రలేచి యోగాలాంటివి చేసేద్దాం అనుకుంటాం. కానీ మొదటి వరకు ఎందుకు ఇవాళే తాగడం మానేయ్. నీకు దమ్ముంటే ఈ డిసెంబర్ 31 సెలబ్రేట్ చేయడం మానేయ్.. చక్కగా భోజనం చేసి 9 గంటలకే పడుకో. అలా చేయగలవా ? చేయవు. రాత్రి అంతా తాగి తందనాలు ఆడతావు. గోల చేయాలి. మరుసటి రోజు ఎప్పుడో లేస్తావు.

రేపటి ఆనందం కోసం ఈరోజు సంతోషాలను వదిలేస్తున్నావు. వర్తమానాన్ని మంట గలుపుతూ భవిష్యత్తు ఆనందం కోసం ఎదురుచూస్తున్నావు. కానీ ప్రస్తుతం నీ చేతుల్లో ఉన్న నిమిషాన్ని పట్టించుకోవు. దాంట్లో ఎప్పుడూ ఆనందం కనిపించదు. అందుకే ఆనందంగా ఉండాలనే కోరిక కలగానే మిగిలిపోతుంది. ఈరోజు కాకుండా.. రేపటి ఆనందం కోసం ఎదురుచూస్తూ బతుకుతున్నావంట అర్థమేంటీ ?. నీకు ఆనందంగా ఉండడం తెలియదు. మనశ్శాంతిగా ఉండడం తెలియదు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం.. ఏదో ఒక రోజు నేను బాగుంటానులే. కష్టాలు తీరిపోతాయిలే అనుకుంటూ బతుకుతుంటే ఆరోజు ఎప్పటికీ రాదు. నిన్న గురించి ఆలోచిస్తూ ఈరోజు సంతోషంగా ఉండడం మర్చిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

డిసెంబర్ 31న ప్రపంచమంతా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. నీ స్నేహితులు కూడా. వాళ్ల సంతోషం అవసరం లేదు. కానీ వాతావరణం బాగుంది. వాళ్లతో కలిసిపో.. డ్యాన్స్ చేయ్. ఈరోజు ఆనందం కోసం ఏదైనా చేయి తప్ప.. రేపటి న్యూఇయర్ కోసం ఏదో చేయొద్దు. రేపు నా జీవితం బాగుంటుందని తాగొద్దు. మారిపోవాలనుకుంటే ఈరోజే మారిపో.. రేపటి పేరు చెప్పి నాటకాలు ఆడొద్దు. సంతోషం రేపు కాదు.. ఈరోజే బాగుంటుంది. హ్యాపీ నౌ హియర్”అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.