Krishna Vamsi: రమ్యకృష్ణతో విడాకులపై మరోసారి స్పందించిన డైరెక్టర్‌ కృష్ణవంశీ.. వారు శాడిస్టులంటూ కామెంట్స్‌

షూటింగ్‌ పనుల నిమిత్తం ప్రస్తుతం కృష్ణవంశీ హైదరాబాద్‌లోనే బిజిబిజీగా ఉంటున్నారు. అలాగే రమ్యకృష్ణ చెన్నైలో ఉంటున్నారు. దీంతో ఈ ఇద్దరూ విడిపోయారని, అందుకే ఇలా విడివిడిగా ఉంటున్నాడని రూమర్లు వస్తున్నాయి. విడాకులు కూడా తీసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.

Krishna Vamsi: రమ్యకృష్ణతో విడాకులపై మరోసారి స్పందించిన డైరెక్టర్‌ కృష్ణవంశీ.. వారు శాడిస్టులంటూ కామెంట్స్‌
Krishna Vamsi, Ramya Krishn
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2023 | 11:47 AM

టాలీవుడ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో రమ్యకృష్ణ- కృష్ణవంశీల జోడీ ఒకటి. అక్కినేని నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆతర్వాత ఏడడుగులు నడిచి తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు. కాగా గత కొద్దికాలంగా రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. షూటింగ్‌ పనుల నిమిత్తం ప్రస్తుతం కృష్ణవంశీ హైదరాబాద్‌లోనే బిజిబిజీగా ఉంటున్నారు. అలాగే రమ్యకృష్ణ చెన్నైలో ఉంటున్నారు. దీంతో ఈ ఇద్దరూ విడిపోయారని, అందుకే ఇలా విడివిడిగా ఉంటున్నాడని రూమర్లు వస్తున్నాయి. విడాకులు కూడా తీసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. వీటిని గతంలోనే చాలాసార్లు ఖండించాడు కృష్ణవంశీ. తాజాగా మరోసారి రమ్యకృష్ణతో విడాకుల రూమర్ల మీద కూడా స్పందించాడీ క్రియేటివ్‌ డైరెక్టర్‌. తన తాజా చిత్రం రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న ఆయన ‘ రమ్యకృష్ణతో విడిపోయారంటూ వస్తోన్న రూమర్లలో ఎలాంటి నిజం లేదు. అలాంటి రూమర్లు వ్యాప్తి చేయడం శాడిస్టిక్ పనులు. అలాంటి వారిని చూస్తుంటే పాపమనిపిస్తోంది. వారు ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోతోన్నారనిపిస్తోంది’ అని కుండబద్దలు కొట్టేశాడు. తద్వారా ఈ జంట విడాకులు తీసుకుంటున్నారనేది పూర్తిగా అవాస్తవమని తెలిసిపోయింది.

మా ప్రపంచం వేరు..

కాగా గతంలోనూ ఈ వార్తలపై స్పందించిన కృష్ణవంశీ.. ‘ నాకు మొదటి నుంచి బంధాలు, బాధ్యతలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలనుకుంటాను. కానీ, ఇవన్నీ పక్కన పెట్టి రమ్యకృష్ణను పెళ్లాడాను. ఆమె ఇష్టాలకు, అభిరుచులకు నేను ఎప్పుడూ గౌరవం ఇస్తాను. ఆమె కూడా నా అభిప్రాయానికి విలువనిస్తుంది. మా మధ్య గొడవలు అని పుకార్లు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి నవ్వుకుంటాం. మేం వాటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాం. మేము ఏంటి.. ఆమె మధ్య బంధం ఏంటి అనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇంట్లోకి వెళ్లాక మా ఇద్దరి ప్రపంచం వేరు’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. కాగా 2017లో విడుదలైన నక్షత్రం తర్వాత మరో సినిమాను తీయలేదు కృష్ణవంశీ. అందుకే ప్రస్తుతం రంగమార్తాండ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా కోసం మెగాస్టార్‌ చిరంజీవి షాయరీ (కవితాఝరి) కూడా అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే