Prabhas: నారి నారి నడుమ మా రెబల్ స్టార్.. ఈ ఇద్దరు హీరోయిన్లతో ప్రభాస్ షాపింగ్.. బాలయ్య ఆసక్తికర కామెంట్స్..
తాజాగా న్యూఇయర్ కానుకగా ప్రభాస్ అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. ఇందులో గోపిచంద్ కూడా వచ్చారు. ఇక ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది.
పాన్ ఇండియా ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డ్స్ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణతో డార్లింగ్ చేసిన అల్లరి.. సరదా ముచ్చట్లు ఆకట్టుకున్నాయి. ప్రేమ, మ్యారెజ్ ప్లాన్స్ గురించి ఎప్పుడూ నోరు విప్పని డార్లింగ్..ఈ షోలో మాత్రం ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాజాగా న్యూఇయర్ కానుకగా ప్రభాస్ అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. ఇందులో గోపిచంద్ కూడా వచ్చారు. ఇక ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. బాలయ్య తన పంచులతో వీరిద్దరిని ఓ ఆటాడుకున్నారు. అలాగే వారి నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. 2008లో ఓ హీరోయిన్ కోసం మీ ఇద్దరూ గొడవ పడ్డారట.. నిజమేనా అని బాలయ్య అడగా.. ప్రభాస్ స్పందిస్తూ.. చెప్పరా… నేనైతే పడలేదు. ఏదైనా ఉంటే చెప్పు అంటూ తప్పుకున్నారు.
ఆ తర్వాత హీరోయిన్ మాళవికా మోహన్.. శ్రుతి హాసన్ ఇద్దరిలో ఎవరితో నీ ఫోన్ మార్చుకుంటావు అని గోపిచంద్ ను అడగ్గా.. నాకు పెళ్లైందని చెప్పుకొచ్చారు. దీంతో పెళ్లి కాకముందు అంటూ ప్రభాస్ అనడం నవ్వులు తెప్పిస్తుంది. తర్వాత నయనతార, తమన్నాలలో ఎవరిని షాపింగ్ కు తీసుకెళ్తావని అడగ్గా.. ఇద్దరితో కలిసి వెళ్తానని అన్నారు ప్రభాస్.
ఇక జిల్ సినిమాలో గోపిచంద్ లుక్ మాములుగా ఉండదని.. అదిరిపోయిందని అన్నారు బాలయ్య. మీరిద్దరు ఇలాగే నవ్వుకుంటూ ఉంటారా.. అసలు ఏం మాట్లాడుకుంటారు ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు బాలయ్య. ఈ సెకండ్ ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.