Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈమె బాహుబలి సిస్టర్‌లా ఉందే.. భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

భారీ క్రేన్‌ను ఎవరైనా ఎత్తగలరా? అంటే అసలు సాధ్యం కాదు. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . దీనిని చూసిన నెటిజన్లందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Viral Video: ఈమె బాహుబలి సిస్టర్‌లా ఉందే.. భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే
Woma Lifting Crane
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2023 | 8:29 AM

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను అందరూ చూసే ఉంటారు. అందులో ఎంతో బరువైన శివలింగాన్ని అలవోకగా భుజాలపై మోసుకొస్తాడు ప్రభాస్‌. అలాగే రాక్షసుల రథాన్ని కూడా ఏదో కాగితపు రథంలాగా సులభంగా ఒంటిచేత్తో లాగుతాడు. సినిమాల్లో ఇలాంటివి సాధ్యం కానీ నిజజీవితంలో మాత్రం ఇలాంటి ఫీట్లు చేయాలంటే చాలా కష్టం. ఇంత బలం, శక్తి మనిషిలో అసలు ఉండవు. అయితే అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు తమ సాహసాలు, ఫీట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇదే క్రమంలో భారీ క్రేన్‌ను ఎవరైనా ఎత్తగలరా? అంటే అసలు సాధ్యం కాదు. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . దీనిని చూసిన నెటిజన్లందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఒక మహిళ జిమ్‌లో 40-50 కిలోల డంబెల్‌ను ఎత్తినట్లుగా క్రేన్‌ను ఎత్తింది. బురదమయమైన ప్రదేశంలో క్రేన్ ఉండటం, వెనుక ఉన్న ఓ మహిళ దానిని ఎత్తేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు.

క్రేన్‌ మధ్యలో ఇనుపరాడ్‌ను ఉంచిన మహిళ, ఆతర్వాత నెమ్మదిగా క్రేన్‌ని పైకి లేపింది. ఈ సీన్ చూస్తే సదరు మహిళ బాహుబలి కంటే చాలా పవర్‌ఫుల్ అని మనకు అనిపిస్తుంది. అయితే అసలు విషయం కాదు.. మొదట డ్రైవర్ ఒ బటన్ సహాయంతో క్రేన్‌ను ఎత్తాడు, అయితే దానిని ఎత్తినట్లు కేవలం పోజులు మాత్రమే ఇస్తుంది మహిళ. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బావాబూజ్ అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షలాదికి పైగా వ్యూస్‌ రాగా, వేలాది లైకులు వస్తున్నాయి. నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ‘వాహ్ దీదీ వాహ్.. స్కామ్ చేయడం మీ నుండే నేర్చుకోవాలి’ అని ఒకరు కామెంట్‌ పెట్టగా, ‘ నేను అసలు మోసపోలేదు’ అని మరొక యూజర్‌ రియాక్ట్‌ అయ్యాడు. మరీ మీరు కూడా ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by BAWA BOOZE (@bawabooze)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..