AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Flowers: మైమరపింపజేస్తున్న ‘మంచుపూల అందాలు’.. అక్కడి న‌దిలో విచ్చుకున్న అద్భుతానికి నెటిజన్లు ఫిదా

ఈ పుష్పం సరస్సులో కనిపించడంతో విభిన్నంగా మారింది. ఈ ఫోటోలు చూసిన వారు ప్రకృతి సృష్టించిన అద్భుత దృశ్యమని అభివర్ణించారు.

Ice Flowers: మైమరపింపజేస్తున్న 'మంచుపూల అందాలు'.. అక్కడి న‌దిలో విచ్చుకున్న అద్భుతానికి నెటిజన్లు ఫిదా
Ice Flowers
Jyothi Gadda
|

Updated on: Jan 02, 2023 | 7:19 AM

Share

ప్రపంచంలోని అనేక ప్రాంతాలు విపరీతమైన చలితో వణికిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో కొన్ని దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. నీటి వనరులు గడ్డకట్టుకుపోతున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్థానికులు పోస్ట్‌లు పెడుతుండటంతో ఇప్పుడవి వైరల్‌ అవుతున్నాయి. గడ్డకట్టిన నదిలో ఏర్పడిన మంచు ఆకారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సరస్సు నలువైపులా ఏర్పడిన పలుచని మంచు పొర పువ్వులా కనిపించింది. ఈ పువ్వు ఎవరో చెక్కినట్లు అందమైన ఆకారంలో ఉంది. కళాకారులు తరచుగా ప్రకృతిలోని అందమైన దృశ్యాల ద్వారా ప్రేరణ పొందుతారు. ఈశాన్య చైనాలోని సాంగ్హువా నదిపై మంచులో ఈ పువ్వు కనిపించింది.

నార్వే మాజీ దౌత్య ప్రతినిధి ఎరిక్ సోల్హీమ్ ఈ అందమైన చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ అద్భుతాన్ని చూశారు. న‌ది పైభాగంలో మంచు ముక్కలు అచ్చం పూల మాదిరిగా విచ్చుకున్న‌ట్టుగా ఉండి అక్కడి స్థానికులతో పాటు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. సూర్య‌కిర‌ణాలు ప‌డిన‌ప్పుడు ఆ మంచు పుష్పాలు మిరుమిట్లు గొలుపుతూ క‌నువిందు చేస్తున్నాయి. నార్వేకు చెందిన మాజీ దౌత్యాధికారి ఎరిక్ సొల్‌హీమ్ శుక్ర‌వారం ట్విట్ట‌ర్‌లో ఈ ఫొటోల‌ను షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ‘ఐస్ ఫ్లవర్స్’ ఏర్పడటానికి కారణం వాతావరణ పరిస్థితుల్లో మార్పులేనంటున్నారు పరిశోధకులు. సాధారణంగా ఈ ‘ఐస్ ఫ్లవర్స్’ పొదలు, ఇతర వాటిపై కనిపిస్తాయి. ఈ పుష్పం సరస్సులో కనిపించడంతో విభిన్నంగా మారింది. ఈ ఫోటోలు చూసిన వారు ప్రకృతి సృష్టించిన అద్భుత దృశ్యమని అభివర్ణించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.