Telugu News Sports News Cricket news Michael neser s stunning catch against sydney sixers batsman jordan silk in big bash league video goes viral OUT or a SIX Debate in social media
Big Bash League Viral Video: బిగ్ బాష్ లీగ్ బ్రిస్బేన్ హీట్ ఆటగాడు మైఖేల్ నేజర్ సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ సిల్క్ యొక్క ఆశ్చర్యకరమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. ఈ క్యాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Michael Neser Catch Viral Video: ఈరోజు బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ బ్రిస్బేన్ హీట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ 15 పరుగుల తేడాతో సిడ్నీ సిక్సర్స్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో అటు అభిమానలు, ఇటు నిపుణులకు అయోమయంలో పడేసిన ఓ సీన్ చోటు చేసుకుంది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తగ వైరల్ అవుతోంది. మైఖేల్ నేజర్ పట్టుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. బ్రిస్బేన్ హీట్ ఆటగాడు మైఖేల్ నేజర్ సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ సిల్క్ కొట్టిన ఓ బంతిని అద్భుతమైన, ఆశ్చర్యకరమైన రీతిలో క్యాచ్ పట్టుకున్నాడు. అయితే మైఖేల్ నేసర్ పట్టుకున్న ఈ క్యాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్యాచ్‌పై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో, సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు క్రికెట్ నిబంధనలకు విరుద్ధంగా క్యాచ్‌ని కాల్ చేస్తున్నారు.
బ్రిస్బేన్ హీట్ ఆటగాడు మైఖేల్ నెజర్ సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ సిల్క్‌కి క్యాచ్ పట్టుకునే సమయంలో.. అతను బౌండరీ వెలుపల ఉన్నాడు. కానీ, అతను బంతిని గాలిలో విసిరాడు. ఆ తర్వాత, బంతి మళ్లీ కిందకు రావడంతో, మైఖేల్ నేజర్ బంతిని బౌండరీ లైన్ లోపల విసిరాడు. ఆ తర్వాత మైఖేల్ నేజర్ బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టుకున్నాడు. అయితే మైఖేల్ నేసర్ పట్టుకున్న ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తూ క్యాచ్‌పై స్పందిస్తున్నారు.
బ్రిస్బేన్ హీట్ విజయం..
ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, బ్రిస్బేన్ హీట్ 15 పరుగుల తేడాతో సిడ్నీ సిక్సర్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 224 పరుగులు చేసింది. బ్రిస్బేన్ హీట్ తరపున, మ్యాక్ స్వీన్ 51 బంతుల్లో 84 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. జోష్ బ్రౌన్ 23 బంతుల్లో 62 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ హీట్ 224 పరుగులకు సమాధానంగా, సిడ్నీ సిక్సర్స్ జట్టు 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 15 పరుగుల తేడాతో సిడ్నీ సిక్సర్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సిడ్నీ సిక్సర్స్‌కు జేమ్స్ విన్స్, జోర్డాన్ సిల్క్ తలో 41 పరుగులు చేశారు.