AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeja Konidela : నాలైఫ్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. మరోసారి వైరల్‌గా మారిన శ్రీజ పోస్ట్‌

ఈమధ్యకాలంలో శ్రీజ, కల్యాణ్‌దేవ్‌లు ఒక్కసారి కూడా జంటగా కనిపించలేదు. ఇటీవల తన కూతురు పుట్టినరోజును కూడా శ్రీజ ఒక్కటే సెలబ్రేట్‌ చేసింది. కల్యాణ్‌ దేవ్ జస్ట్‌ సోషల్‌ మీడియా వేదికగా మాత్రమే తన కుమార్తెకు బర్త్‌ డే విషెస్‌ తెలిపాడు. ఈనేపథ్యంలో శ్రీజ తాజాగా షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Sreeja Konidela : నాలైఫ్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. మరోసారి వైరల్‌గా మారిన శ్రీజ పోస్ట్‌
Sreeja Konidela
Basha Shek
|

Updated on: Jan 03, 2023 | 11:11 AM

Share

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు రూమర్లు వస్తున్నాయి. భర్త కల్యాణ్‌దేవ్‌తో వైవాహిక బంధంపై పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తగ్గట్టే ఈమధ్యకాలంలో శ్రీజ, కల్యాణ్‌దేవ్‌లు ఒక్కసారి కూడా జంటగా కనిపించలేదు. ఇటీవల తన కూతురు పుట్టినరోజును కూడా శ్రీజ ఒక్కటే సెలబ్రేట్‌ చేసింది. కల్యాణ్‌ దేవ్ జస్ట్‌ సోషల్‌ మీడియా వేదికగా మాత్రమే తన కుమార్తెకు బర్త్‌ డే విషెస్‌ తెలిపాడు. ఈనేపథ్యంలో మెగా డాటర్ తాజాగా షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ వైరల్‌గా మారింది. కొత్త సంవత్సరం సందర్భంగా గతేడాది జరిగిన మూమెంట్స్‌ని షేర్‌చేసిన ఆమె ‘కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా’ అంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ షేర్‌ చేసింది

మనల్ని మనం ప్రేమించుకోవాలి..

‘డియర్‌ 2022.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కష్ట సుఖాల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకునే, అమితంగా ప్రేమించే, అన్ని విధాలుగా సంరక్షించే, నాకు సపోర్టుగా నిలబడేవాడు నన్ను కలవడం అద్భుతం. ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త ప్రయాణం మొదలైంది’ అని శ్రీజ రాసుకొచ్చింది. దీనికి #SelfConnection, #Innerpeace అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది. సెల్ఫ్‌ లవ్‌ను ఉద్దేశించి శ్రీజ పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు ఈ పోస్టుపై స్పందిస్తున్నారు. ‘మీరు చెప్పింది నిజమే. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం, సెల్ఫ్‌ కేర్‌ మనం ఇంపార్టెన్స్‌ ఇవ్వాలి’ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sreeja (@sreejakonidela)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ