Vijay- Rashmika: అభిమానుల కోసం రష్మిక లైవ్‌ డ్యాన్స్..స్టేజి మీదనే దిష్టి తీసిన హీరో విజయ్‌

రంజితమే.. రంజితమే.. వారిసు ( తెలుగులో వారసుడు) సినిమాలోని ఈ పాట గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఫేస్‌ బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌.. ఎక్కడ చూసిన ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్, వీడియోలే దర్శనమిస్తున్నాయి

Vijay- Rashmika: అభిమానుల కోసం రష్మిక లైవ్‌ డ్యాన్స్..స్టేజి మీదనే దిష్టి తీసిన హీరో విజయ్‌
Vijay, Rashmika
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2023 | 10:02 AM

రంజితమే.. రంజితమే.. వారిసు ( తెలుగులో వారసుడు) సినిమాలోని ఈ పాట గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఫేస్‌ బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌.. ఎక్కడ చూసిన ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇక ఇటీవల ఈ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు లైవ్‌లో డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది నటి రష్మిక మంధాన. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌తో కలిసి ఆమె చేసిన డ్యాన్స్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషి అయ్యారు. చెన్నైలో ఇటీవల జరిగిన వారిసు ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌ ఇందుకు వేదికగా మారింది. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఫుటేజీని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో హీరో విజయ్‌.. మాట్లాడుతూ.. సినిమా కోసం పని చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు. సినిమాలో తనతో పాటు నటించిన ఆయా నటీనటులతో.. తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ముఖ్యంగా నిర్మాత దిల్‌ రాజు, వంశీ పైడిపల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

నా కల నెరవేరింది..

కాగా ఇదే స్పీచ్‌లో రష్మిక గురించి ప్రస్తావించాడు విజయ్‌.. ఆమె మంచి నటి అని రీల్, రియల్‌ లైఫ్‌లోనూ ఒకేలా ఉంటుందని ప్రశంసించాడు. అంతేకాదు అశేష అభిమానుల సమక్షంలో లైవ్‌ డ్యాన్స్‌ చేసినందుకు స్టేజి మీదనే ఆమెకు దిష్టి తీశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అనంతరం రష్మిక మాట్లాడుతూ ‘ గిల్లి (తెలుగులో ఒక్కడు) సినిమాతో విజయ్‌కు వీరాభిమానిగా మారిపోయాను. ఆయన సినిమాలు చూస్తూ ఈలలు వేసి గోల చేసిన సందర్భాలున్నాయి. ఆయనతో కలిసి నటించాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. విజయ్‌ సర్‌.. మీతో మళ్లీ సినిమా చేసే అవకాశం వచ్చినా ఇలాగే చూస్తూ ఉండిపోయేలా ఉన్నాను. ఐ లైక్‌ యూ సర్‌’ అని విజయ్‌పై అభిమానం కురిపించింది రష్మిక. కాగా వీరిద్దరూ కలిసి నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..