Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పోలీసన్న తెగువకు సలాం చెప్పాల్సిందే.. టవర్‌పై చిక్కుకున్న పక్షిని ఎలా కాపాడాడో మీరే చూడండి

బెంగుళూరు ట్రాఫిక్ పోలీసు తన ప్రాణాలను పణంగా పెట్టి పక్షి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లందరూ ట్రాఫిక్‌ పోలీసును ప్రశంసిస్తూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

Viral Video: పోలీసన్న తెగువకు సలాం చెప్పాల్సిందే.. టవర్‌పై చిక్కుకున్న పక్షిని ఎలా కాపాడాడో మీరే చూడండి
Traffic Police
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2023 | 9:59 AM

సాధారణంగా ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేస్తారు? వాహనదారులను రోడ్డు, ట్రాఫిక్‌ నిబంధనలను సక్రమంగా పాటించేలా చూస్తుంటారు. అలాగే నిబంధనలను అతిక్రమిస్తున్న వారికి జరిమానాలు, శిక్షలు వేస్తుంటారు. దీంతో చాలామందికి వీరిపై ఓ రకమైన కోపం, చిన్నచూపు ఉంటాయి. అయితే అందరూ అలాగే ఉండని కొంతమంది పోలీసులు నిరూపిస్తున్నారు. ఆపదల్లో ఉన్న వారికి తమ చేతనైన సహాయం చేస్తూ ఖాకీ డ్రెస్సు మాటున కూడా కరుణ, జాలి, దయ ఉంటుందని నిరూపిస్తున్నారు. వృద్ధులు, రోడ్డు దాటలేని వారిని చేయి పట్టుకుని ట్రాఫిక్‌ పోలీసులు చేయి పట్టుకుని సహాయం చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈక్రమంలో బెంగుళూరు ట్రాఫిక్ పోలీసు తన ప్రాణాలను పణంగా పెట్టి పక్షి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లందరూ ట్రాఫిక్‌ పోలీసును ప్రశంసిస్తూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని రాజాజీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సురేష్ తన ప్రాణాలను పణంగా పెట్టి మొబైల్ టవర్‌పై ఇరుక్కుపోయిన పక్షిని రక్షించాడు. ఈ వీడియోను బెంగళూరులోని వెస్ట్ ట్రాఫిక్ డివిజన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ కులదీప్ కుమార్ ఆర్ జైన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సురేశ్‌ను ప్రశంసిస్తూ లక్షలాది లైకులు, కామెంట్లు వెల్లువెత్ఆయి. ఇక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా ఇదే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, ‘మా ట్రాఫిక్ పోలీసులు కూడా రెస్క్యూ పనిలో పాల్గొంటున్నారు. టవర్‌లో ఇరుక్కుపోయిన కాకిని రాజాజీనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ సురేశ్‌ ఎంతో శ్రద్ధతో రక్షించారు. అతని సమయస్ఫూర్తికి, కర్తవ్య భావానికి అభినందనలు’ అని ప్రశంసలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి సురేష్ కుమార్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను షేర్‌ చేయగా

సురేష్ ధైర్యాన్ని, నిస్వార్థతను నెటిజన్లు కొనియాడుతుండగా, మరికొందరు మాత్రం భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. అలాగే ఆయనకు తగిన అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. బైక్‌ రైడర్లందరికీ హెల్మెట్ తప్పనిసరి చేసినట్లే, పోలీసుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. మొత్తానికి ఎలాంటి సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకుండా పక్షిని కాపాడిన ట్రాఫిక్ పోలీస్ సురేష్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఏవైనా సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ధరించి పక్షిని కాపాడి ఉండాల్సిందని చాలామంది సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..