Electricity Bill: స్వాతంత్ర్యం రాకముందు కరెంటు బిల్లు ఎంత వచ్చేదో తెలుసా..? చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
తాజాగా, స్వాతంత్ర్యానికి పూర్వం నాటి కారెంటు బిల్లు ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి.. అప్పట్లో విద్యుత్ బిల్లు ఇంతే వచ్చేదా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అప్పటితో పోల్చితే..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిని చూసి చాలామంది నెటిజన్లు ఇది నిజమా అంటూ నోరెళ్లబెడుతుంటారు. తాజాగా, స్వాతంత్ర్యానికి పూర్వం నాటి కారెంటు బిల్లు ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి.. అప్పట్లో విద్యుత్ బిల్లు ఇంతే వచ్చేదా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అప్పటితో పోల్చితే.. కరెంటు బిల్లు జస్ట్ రూపాయల నుంచి వందలు, వేలకు చేరిందని పేర్కొంటున్నారు. సాధారణంగా.. హోటల్ బిల్లులు, పాత మోటార్‌సైకిల్ బిల్లులు, పాత మార్కెట్ బిల్లులు తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతాయి. అలాంటిదే విద్యుత్ బిల్లు ఒకటి తెరపైకి వచ్చింది. స్వాతంత్య్రానికి ముందు ఇంటి కరెంటు బిల్లు ఎంత వచ్చేదని ఎప్పుడైనా ఆలోచించారా..? ఎప్పుడూ ఆలోచించి ఉండరు.. ఎందుకంటే అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు కరెంటు బిల్లు.. వందలు, వేలు.. లక్ష వరకు కూడా ఉంటోంది. ఈ తరుణంలో వైరల్ అవుతున్న 83 ఏళ్ల నాటి కరెంటు బిల్లును చూసి.. జనం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒక నెల మొత్తం విద్యుత్తు సరఫరాను ఉపయోగించినందుకు బిల్లు మొత్తంగా రూ.5 చూపించే విద్యుత్ రశీదును చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అయిన 1940 అక్టోబర్ 15వ తేదీ నాటి విద్యుత్ బిల్లు
ఈ స్లిప్‌లో ఈ విద్యుత్ బిల్లు అక్టోబర్ 15, 1940 తేదీగా ఉంది. ఇది బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రామ్‌వే ( BEST) కంపెనీ లిమిటెడ్‌కి చెందినదిగా తెలుస్తోంది. ఈ ప్రైవేట్ కంపెనీ దీనిని ఆగస్టు 7, 1947న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) స్వాధీనం చేసుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా BEST కంపెనీ ఉండిందని.. బస్సులు దాని కిందకే వస్తాయని పేర్కొంటున్నారు.
వైరల్ అయిన ఈ పాత బిల్లులో కేవలం రూ.3.10 యూనిట్ల కరెంటు వినియోగించారు. దీనికి పన్నులు కలపగా ఈ బిల్లు రూ.5.2పైసలు అయినట్లు తెలుస్తోంది. అప్పట్లో కరెంటు బిల్లులు చేతితో రాసి ఇచ్చేవారు.
పాత బిల్లుతో ప్రస్తుత విద్యుత్ బిల్లుకు పోలుస్తున్న నెటిజన్లు..
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నాటి కరెంటు బిల్లు వైరల్ కావడంతో నెటిజన్లు పాత బిల్లును కరెంట్ రేట్లతో పోల్చడం మొదలుపెట్టారు. 1940వ దశకంలో నెలకు 5 రూపాయలకే కరెంటు లభించేది.. ఇప్పుడు యూనిట్ ఖరీదు 5 రూపాయలకు పెరిగిందని పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా ఇప్పుడు కరెంట్ ఫుల్ కాస్ట్లీ గురూ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, ఈ బిల్లు నిజమా.? కాదా..? అన్న క్లారిటీ లేదు.. ది బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రామ్‌వే కంపెనీ లిమిటెడ్ గా బిల్లు రశీదు ఉండటంతో.. అప్పటిదేనని పేర్కొంటున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం..