AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Lasya: వేడుకగా యాంకర్‌ లాస్య సీమంతం.. సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీలు.. మెగాస్టార్‌ పాటకు స్టెప్పులు

లాస్య బిగ్‌బాస్‌ టీమ్‌ మేట్స్‌తో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీర‌య్య లోని డోంట్ స్టాప్ డాన్సింగ్ పూన‌కాలు లోడింగ్ పాటకు హుషారైన స్టెప్పులేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

Anchor Lasya: వేడుకగా యాంకర్‌ లాస్య సీమంతం.. సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీలు.. మెగాస్టార్‌ పాటకు స్టెప్పులు
Anchor Lasya
Basha Shek
|

Updated on: Jan 06, 2023 | 12:06 PM

Share

ప్రముఖ యాంకర్ లాస్య మరోసారి తల్లికానుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు భర్త మంజునాథ్‌తో కలిసి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిందీ స్టార్‌ యాంకర్‌. తాజాగా ఆమె సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. బిగ్‌బాస్‌ ఫేం గీతూ రాయల్, దేత్తడి హారిక, మెహ‌బూబా, నటి శ్రీవాణి తదితరులు హాజరై లాస్య దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లాస్య బిగ్‌బాస్‌ టీమ్‌ మేట్స్‌తో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీర‌య్య లోని డోంట్ స్టాప్ డాన్సింగ్ పూన‌కాలు లోడింగ్ పాటకు హుషారైన స్టెప్పులేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. నెటిజన్లందరూ లాస్య దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్‌ అనే కుమారుడికి జన్మనిచ్చింది.

కాగా మాటల గారడీతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది లాస్య. తనదైన కామెడీ పంచులు, జోక్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ఏనుగు-చీమ జోక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత యాంకర్‌ రవితో చేసిన షోలు బాగా ఆదరణ పొందాయి. ఇక బిగ్‌బాస్‌ రియాల్టీషోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక టీవీ షోలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార. నిత్యం తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ విషయాలను పంచుకుంటుంది. అలాగే తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌తో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..