Sunil Babu: వారిసు సినిమా ఆర్డ్ డైరెక్టర్ కన్నుమూత.. విషాదంలో సినిమా ఇండస్ట్రీ
కేరళలోని పాతనంతిట్టలోని మల్లాపల్లికి చెందిన సునీల్ పలు తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు (తెలుగులో వారసుడు) సినిమాకు సునీల్ చివరిగా పని చేశారు.
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా దక్షిణ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ బాబు కున్నమూశారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఆయన వయసు 50 ఏళ్లు. అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళలోని పాతనంతిట్టలోని మల్లాపల్లికి చెందిన సునీల్ పలు తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు (తెలుగులో వారసుడు) సినిమాకు సునీల్ చివరిగా పని చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో వారిసు సినిమా యూనిట్ అంతా షాక్ లో ఉండిపోయింది. వివిధ భాషల్లో 100 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సునీల్ తెలుగులో మహర్షి, సీతారామం తదితర సినిమాలకు వర్క్ చేశారు. అలాగే బాలీవుడ్‌లో ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యం, స్పెషల్ చౌబీజ్ తదితర హిట్ సినిమాలకు ఆర్ట్ డైరెక్షన్ చేశారు.
100 సినిమాలకు పైగా..
మైసూరు ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న సునీల్ మొదట ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆతర్వాత అనంతభద్రం సినిమాకు మొదటిసారిగా ఆర్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఉరుమి, ఛోటా ముంబై, అమీ, ప్రేమమ్, నోట్‌బుక్, కాయంకుళం కొచ్చున్ని, పజాసిరాజా, బెంగుళూరు డేస్ వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన ఆయన ఉత్తమ కళా దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. సునీల్ బాబుకు భార్య, కూతురు ఆర్య సరస్వతి ఉన్నారు. శుక్రవారం (డిసెంబర్ 6) అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..