- Telugu News Photo Gallery Cinema photos Dhamaka Actress Sreeleela Will Act in Pawaln Kalyan And Director Sujeeth Movie telugu cinema news
Sreeleela: పెళ్లి సందD బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల.. ఏ సినిమాలో అంటే..
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది శ్రీలీల. వెన్నెలమ్మలాంటి మోము.. అందమే అసూయ పడేతంత ఆకర్షణీయమైన రూపమే కాదు.. అభినయం కూడా ఎక్కువే.
Updated on: Jan 07, 2023 | 12:10 PM

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది శ్రీలీల. వెన్నెలమ్మలాంటి మోము.. అందమే అసూయ పడేతంత ఆకర్షణీయమైన రూపమే కాదు.. అభినయం కూడా ఎక్కువే.

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికలకు పోటీగా చేతి నిండా సినిమాలతో బిజీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి సందడి తర్వాత మాస్ మాహారాజా సరసన ధమకా చిత్రంలో నటించింది ఈ అమ్మడు..

ఇటీవల విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.

ఇప్పటికే ఆమె రామ్ పోతినేని, నితిన్, వైష్ణవ్ తేజ్.. శర్వానంద్ సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహార వీరమల్లు సినిమా చేస్తున్న పవన్.. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులను స్టార్ట్ చేయనున్నారు. అందులో ఒకటి డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉండనుంది.

అలాగే మరోకటి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీలను ఎంపిక చేయాలని భావిస్తున్నారట మేకర్స్..ఇటు ధమాకా సినిమాలో రవితేజ జోడిగా ఆమె మెప్పించిన తీరు తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్..

ఇక సుజిత్ దర్శకత్వంలో పవన్.. శ్రీలీల జోడి.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లుగా సమాచారం. చూడాలి మరి... రవితేజ సరసన మెప్పించిన శ్రీలీలకు పవన్ సరసన ఛాన్స్ అంటే మాములు విషయం కాదు మరీ.

Sreeleela: పెళ్లి సందD బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల.. ఏ సినిమాలో అంటే..



















