AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chand Basha: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

చాంద్ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు. తెలుగులో ఖడ్గ తిక్కన, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు తదితర సినిమాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. అలాగే కన్నడంలో అమర భారతి, చేడిన కిడికి కన్నడ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించారు.

Chand Basha: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత
Chandrabose Family
Basha Shek
|

Updated on: Jan 07, 2023 | 10:59 AM

Share

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ మామ, భార్య సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా (92) కన్నుమూశారు. శుక్రవారం (జనవరి 6) రాత్రి మణికొండలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. చాంద్ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు. తెలుగులో ఖడ్గ తిక్కన, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు తదితర సినిమాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. అలాగే కన్నడంలో అమర భారతి, చేడిన కిడికి కన్నడ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో చాంద్‌బాషా అంత్యక్రియలు జరగనున్నాయి. చాంద్ బాషా మృతితో చంద్రబోస్‌ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రబోస్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. చాంద్ బాషాకి మొత్తం నలుగురు సంతానం కాగా వారిలో ముగ్గురు కుమార్తెలు, మరొకరు కుమారుడు ఉన్నారు.

ఇక కూతురు సుచిత్రా చంద్రబోస్ టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా అందరికీ సుపరిచితమే. నాగార్జు, శ్రీదేవి నటించిన ఆఖరిపోరాటం అనే సినిమాతో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారామె. ఆతర్వాత చైతన్య, వన్‌ బై టూ, మనీ, గాండీవం, ఘరానా బుల్లోడు, వినోదం, అన్నమయ్య, జయం మనదేరా, ప్రియమైన నీకు, నువ్వునాకు నచ్చావ్‌, మనసంతా నువ్వే, నువ్వే నువ్వే, వాన, ఝుమ్మంది నాదం, గోపాల గోపాల తదితర హిట్‌ సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2004లో బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారామె.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..