Tollywood: సూర్యుడితోనే దాగుడు మూతలు ఆడేస్తున్న ఈ సుందరి ఎవరో గుర్తుపట్టండి.. తెలుగులో క్రేజీ హీరోయిన్..

నటన పరంగా ప్రశంసలు అందుకుంటున్నా.. అవకాశాలు మాత్రం అందుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. కుర్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ రాణిస్తోంది. ఈ కేరళ కుట్టి తెలుగులోనే కాదు.. మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: సూర్యుడితోనే దాగుడు మూతలు ఆడేస్తున్న ఈ సుందరి ఎవరో గుర్తుపట్టండి.. తెలుగులో క్రేజీ హీరోయిన్..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 07, 2023 | 10:53 AM

సూర్యుడితోనే దాగుడు మూతలు ఆడేస్తూ.. చూపులతో కవ్విస్తోన్న ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి. చిన్న వయసులోనే కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం మాత్రం అవగింజంత మాత్రమే అనుకోవాలి. నటన పరంగా ప్రశంసలు అందుకుంటున్నా.. అవకాశాలు మాత్రం అందుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. కుర్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ రాణిస్తోంది. ఈ కేరళ కుట్టి తెలుగులోనే కాదు.. మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి. న్యాచురల్ నాని సరసన ఓ సూపర్ హిట్ సినిమాలో నటించింది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో రాబోతుంది.

ఈ అందాల ముద్దుగుమ్మ మరెవరో కాదు.. కేరళ కుట్టి మాళవిక నాయర్. ఈ అమ్మడు పుట్టింది ఢిల్లీలో అయినా.. పెరిగింది మాత్రం కేరళలో. హైదరాబాద్ లోని ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మాళవిక.. మోడల్ గా కెరీర్ ఆరంభించింది. ఉస్తాద్ హోటల్ అనే మలయాళం సినిమాతో కథానాయికగా అడుగుపెట్టిన ఈ చిన్నది.. న్యాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కళ్యాణ వైభోగమే.. మహానటి, విజేత, టాక్సీవాలా, ఓరేయ్ బుజ్జిగా.. థాంక్యూ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దగుమ్మ అన్ని మంచి శకునములే.. ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.