Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: హీరో మాత్రమే కాదు.. అజిత్ పైలట్ కూడా.. విమానాలు నడిపేందుకు లైసెన్స్ కూడా ఉందని తెలుసా..

అజిత్ కు తెలుగులోనూ యమ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు టాలీవుడ్ లోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న తారలలో అజిత్ స్టైల్ వేరు. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మొబైల్ లేకుండా క్షణం కూడా ఉండలేరు.

Ajith Kumar: హీరో మాత్రమే కాదు.. అజిత్ పైలట్ కూడా.. విమానాలు నడిపేందుకు లైసెన్స్ కూడా ఉందని తెలుసా..
Ajith Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2023 | 10:48 AM

తునీవు సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారు తమిళ్ స్టార్ అజిత్ కుమార్. ఇటీవల వాలిమై మూవీతో ప్రేక్షకులను ఈ స్టార్ హీరో… ఇప్పుడు సంక్రాంతి బరిలో విజయ్ దళపతితో పోటీపడనున్నారు. ఇప్పటికే తమిళనాడులో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైన సంగతి తెలిసిందే. అజిత్ కు తెలుగులోనూ యమ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు టాలీవుడ్ లోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న తారలలో అజిత్ స్టైల్ వేరు. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మొబైల్ లేకుండా క్షణం కూడా ఉండలేరు. కానీ ఈ హీరోకు ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఫోన్ కూడా లేదు. తన మేనేజర్ సహాయంతో తన కుటుంబసభ్యులకు.. అభిమానులకు ఇంట్రాక్ట్ అవుతుంటారు. అలాగే ఇప్పటికీ ఎలాంటి మేకప్ లేకుండానే స్క్రీన్ ముందుకు వచ్చేస్తారు. నెరిసిన జుట్టుకు రంగు వేయకుండా.. చేతి వేళ్లతో తలను దువ్వుకుంటూ.. రగ్గడ్ లుక్‏లో ఇసుమంతైన మేకప్ లేకుండా బిగ్ స్క్రీన్ పై కనిపిస్తారు అజిత్. ఇవే కాదు.. వ్యక్తిగత జీవితంలో అజిత్ శైలీ ప్రత్యేకమనే చెప్పుకోవాలి.

ఆయనకు ఫోటోగ్రఫీ.. ట్రావెలింగ్ అంటే అమితమైన ఇష్టం. షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికినా.. బైక్ పై రైడ్ కు వెళ్తుంటారు. గతంలో కన్యాకుమారి టూ లడక్ వరకు బైక్ బై సింగిల్ గా రైడ్ వెళ్లారు. ఇవే కాదు.. ఆయనకు విమానాలు నడపడం కూడా చాలా ఇష్టం. అజిత్ హీరో మాత్రమే కాదు.. పైలట్ కూడా. అతనికి విమానాలు నడిపేందుకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది. ఏరో మోడలింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. అజిత్ ఎక్కువగా కార్ స్టంట్స్ చేస్తుంటారు. రేసింగ్ అంటే మక్కువ.

ఇప్పటివరకు అతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అనేక రేసింగ్ పోటీలలో పాల్గొన్నారు. 2003లో రేసింగ్ ప్రారంభించిన అజిత్.. 2010లో FIA ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నారు. మెకానిక్ ఉద్యోగంతో కెరీర్ ఆరభించిన అజిత్.. ఇప్పుడు స్టార్ హీరోగా వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తునీవు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.