AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? అందుకే శ్రీలీలను..

శ్రీలీల గత సినిమాల కంటే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు.. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం దాదాపు శ్రీలీల చుట్టే కథ తిరుగుతుంది. అయితే ఈ పాత్రకు శ్రీలీల కంటే ముందుగా ఓ స్టార్ హీరోయిన్ ను అనుకున్నారు.

Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? అందుకే శ్రీలీలను..
Ustaad Bhagat Singh
Basha Shek
|

Updated on: Mar 20, 2026 | 2:17 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉగాది కానుకగా గురువారం (మార్చి 19) రిలీజైన ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోకపోయినా బాగుందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ మూవీ తెగ నచ్చేస్తోంది. పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, డ్యాన్సులు, ఫైట్స్ కు అయితే థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. గబ్బర్ సింగ్ తో పవన్ కు ఇండస్ట్రీ హిట్ ను అందించిన హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించాడు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అయితే ఇందులో రాశీ ఖన్నా కంటే శ్రీలీల పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇందులో లీల ఆనే రేడియో జాకీ పాత్రలో కనిపించింది శ్రీలీల. తన క్యూట్ యాక్టింగ్, స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సెకండాఫ్ సినిమా కథ మొత్తం ఈ బ్యూటీ చుట్టే తిరుగుతుంది. పవన్-శ్రీలీల కాంబినేషన్స్ లో వచ్చే సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక వీరి మధ్య వచ్చే వచ్చే తొలిప్రేమలోని ‘ ఈ మనసే’ సాంగ్ రీమిక్స్ అయితే ఆడియెన్స్ కు ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. మొత్తానికి శ్రీలీల గత సినిమాలతో పోల్చితే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. అలాగే యాక్టింగ్ పరంగా మంచి స్కోప్ కూడా ఇచ్చారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ రోల్ కు శ్రీలీల కంటే ముందు వేరే హీరోయిన్ ను తీసుకున్నారు మేకర్స్. కానీ కొన్ని కారణాలవల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజా హెగ్డే . హరీష్ శంకర్ తెరకెక్కించిన డీజే సినిమాలో పూజా హీరోయిన్ గా నటంచింది. దీంతో మళ్లీ ఆమెకే ఛాన్స్ ఇవ్వాలనుకున్నారట హరీశ్. అయితే పూజా హెగ్డే మాత్రం అప్పుడు బిజీగా ఉండడం వల్ల తను వేరే సినిమాలకు కమిట్ అయి ఉండడంతో ఈ సినిమాను మిస్ చేసుకుందట.

View this post on Instagram

A post shared by SREELEELA (@sreeleela14)

మొత్తానికి పూజా హెగ్డే వదిలేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా శ్రీలీలకు బాగా హెల్ప్ అయ్యిందట. దీని తర్వాత ఆమెకు మరిన్ని హీరోయిన్ ఛాన్సులు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం శ్రీలీల దక్షిణాదితో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.

View this post on Instagram

A post shared by SREELEELA (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
ఒక్కో మహిళ రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు..
ఒక్కో మహిళ రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?