AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా బాక్సాఫీస్‏నే షేక్ చేస్తున్నా నటుడు..

ఒకప్పుడు హీరోగా అలరించారు. కానీ ఆయన చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. 50 ఏళ్ల వయసులో విలన్ పాత్రలో రీఎంట్రీ ఇచ్చి.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలో భారీ విజయాన్ని సాధించాడు. ఇంతకీ అతడి పేరెంటో తెలుసా..? పాన్ ఇండియా లెవల్లో అతడి పేరు మారుమోగుతుంది.

Tollywood : హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా బాక్సాఫీస్‏నే షేక్ చేస్తున్నా నటుడు..
Akshaye Khanna
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2026 | 2:22 PM

Share

భారతీయ సినీరంగంలో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. నటుడిగా తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. కానీ హీరోగా ఒక్క సినిమా కూడా హిట్టు కాలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు 50 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇచ్చారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అతడి యాక్టింగ్, ఫిట్నెస్ లుక్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తన కెరీర్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లి, నేడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. 2026లో ఈ నటుడు అనేక ప్రధాన ప్రాజెక్టులతో ఒక కొత్త శకాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుం సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే తన కెరీర్ ను పటిష్టం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? అతడే అక్షయ్ ఖన్నా.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ధురంధర్ సినిమాలో ఆయన రెహమాన్ పాత్రలో నటించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది. అయితే ఇప్పుడు విడుదలైన ‘ధురందర్: ది రివెంజ్’లో మళ్లీ కనిపిస్తాడనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ అది నిజం కాలేదు. కానీ ధురంధర్ సినిమాలో అతడి నటన, ప్రతిభ ప్రేక్షకులను కట్టిపడేసింది. అక్షయ్ ఖన్నా ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం ‘మహాకాళి’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్య మహర్షి పాత్రను పోషిస్తున్నాడు. ఇది అతడి కెరీర్ లో మరో విభిన్నమైన, ఆసక్తికరమైన మలుపు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మహాకాళి 2026లో హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us