AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం ప్రకటన

తెలంగాణలోని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో రికార్డు స్థాయి మొక్క జొన్న దిగుబడి నేపథ్యంలో నేటి నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలో 20 కేంద్రాల ద్వారా ఈ కొనుగోళ్లు చేయనున్నట్టు ప్రకటించింది.

Telangana: రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం ప్రకటన
PM Kisan
Anand T
|

Updated on: Mar 20, 2026 | 2:49 PM

Share

తెలంగాణలో మెుక్కజొన్న రైతులకు ఇదో బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మొక్క జొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇవాళ్టి (మార్చి 20) నుంచి రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు క్వింటాల్‌కు రూ. రూ.2,400 మద్దతు ధర అందించాలని మార్క్‌ఫెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,21,494 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 29.79 లక్షల టన్నుల మేర మొక్కజొన్న దిగుబడి రానుంది. అయితే ఇప్పటికే మార్కెట్‌లో చాలా వరకు మొక్కజొన్న స్టాక్ ఉండడంతో వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అయితే రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో మొక్కజొన్న దిగుబడి రావడంలో మొక్కజొన్నను కొనుగోలు చేయాలని కోరుతూ ఈసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ లేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం మొత్తం దిగుబడిలో నుంచి 8 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఈ 8 వేల క్వింటాళ్ల కొనుగోళ్లకు గాను కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది.

అయితే వ్యాపారులు మాత్రం రైతుల నుంచి క్వింటాల్‌ మొక్కజొన్నను కేవలం రూ.1,600 నుంచి రూ.1,800కు మాత్రమే కొనుగోళు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రకటించిన ఈ 8వేల క్వింటాళ్ల పరిమితి దాటితే.. మద్దతు ధరకు కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?