Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో వారు జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Daily Horoscope (July 8, 2026): బుధవారం రాశిఫలాల ప్రకారం మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. వృషభ, మిథున రాశి వారికి ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంది? ఏ రాశి వారికి ఏ రంగంలో శుభఫలితాలు, ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోండి.

దిన ఫలాలు (జూలై 8, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు తగిన సానుకూల స్పందన లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పురోగమిస్తాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు తగిన సానుకూల స్పందన లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ప్రమోషన్ మీద స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థి తులు ఏర్పడతాయి. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. ఆదాయంతో పోటీగా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల దగ్గర నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ప్రయో జనం పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వాహన సౌకర్యం కలుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం బాగా సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ఇంటా బయటా అదనపు బాధ్యతల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా, అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వాహనాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంవారు లాభాల పంట పండించు కుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. బంధువుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా మారిపోతాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం శ్రేయస్కరం. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఇంట్లో మరమ్మతులు చేపట్టి, కొన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడడం ప్రారంభిస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని అత్యవసరంగా చక్కబెట్టాల్సి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడ బతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక కార్య కలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఏ వృత్తి అయినప్పటికీ, బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో కార్య సిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
Also Read: వారికి కాలసర్ప దోష విముక్తి.. ఆర్థికంగా శీఘ్ర పురోగతి..!



