AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..? పెద్దల ఆచారాల వెనుకున్న అసలు నిజాలు..

బయటకు అడుగుపెట్టే సమయంలో ఎవరైనా తుమ్మితే వెంటనే ఆగిపోతున్నారా? రోడ్డుపై పిల్లి ఎదురొస్తే బండి పక్కకు ఆపి వేరేవాళ్లు వెళ్లేవరకు ఎదురుచూస్తున్నారా? మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న ఇలాంటి శకునాలను ఇప్పటికీ చాలామంది మూఢనమ్మకాలుగానే చూస్తుంటారు. అయితే మన పూర్వీకులు ఏ ఒక్క ఆచారాన్ని కూడా కారణం లేకుండా పెట్టలేదు. వాటి వెనుకున్న అసలు నిజాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..? పెద్దల ఆచారాల వెనుకున్న అసలు నిజాలు..
Why People Stop When Someone Sneezes
Krishna S
|

Updated on: Oct 04, 2026 | 5:15 PM

Share

మన భారతీయ సంస్కృతిలో నిత్య జీవితంలో ఎన్నో ఆచారాలు, శకునాలు కలిసిపోయాయి. బయటకు వెళ్లే సమయంలో ఎవరైనా తుమ్మినా, లేదా ఎదురుగా నల్ల పిల్లి వెళ్లినా కాసేపు ఆగి, నీళ్లు తాగి బయలుదేరడం దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. అలాగే సాయంత్రం వేళల్లో గోళ్లు కత్తిరించకూడదని, అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదని పెద్దలు కఠినంగా చెబుతుంటారు. చాలామంది వీటిని కేవలం మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తుంటారు. కానీ మన పూర్వీకులు ఈ నియమాలు పెట్టడం వెనుక బలమైన వైజ్ఞానిక, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బయలుదేరేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు?

బయటకు వెళ్లే సమయంలో ఎవరైనా ఒకసారి తుమ్మితే అపశకునమని, వెళ్లే పని జరగదని, కాసేపు ఆగి నీళ్లు తాగి వెళ్లాలని నమ్ముతారు. దీని వెనుకున్న అసలు సైన్స్ ఏంటంటే.. ఒక వ్యక్తి తుమ్మినప్పుడు ఊపిరితిత్తుల నుంచి గాలి గంటకు దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంది. తుమ్ము వచ్చినప్పుడు గుండె లయలో మైక్రో సెకన్ల పాటు స్వల్ప మార్పు రావడం, కండరాలు ఒక్కసారిగా సంకోచించడం జరుగుతుంది. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, అలర్జీ వచ్చినా లేదా నాడీ వ్యవస్థపై ఒత్తిడి పడినా తుమ్ము వస్తుంది. ప్రయాణానికి బయలుదేరే ముందు తుమ్మినప్పుడు వ్యక్తి శరీరంలో రక్తపోటు, ఏకాగ్రత కాసేపు పక్కదారి పడతాయి. అందుకే కాసేపు కూర్చుని, కాస్త మంచినీళ్లు తాగితే శరీరం సాధారణ స్థితికి వస్తుంది. ఆ తర్వాత ప్రశాంతమైన మైండ్‌తో ప్రయాణం చేయవచ్చని మన పూర్వీకులు ఈ పద్ధతి పెట్టారు. దానికి శకునం రంగు పులిమి తప్పనిసరి చేశారు.

పిల్లి ఎదురొస్తే కాసేపు ఆగిపోవాలనేది ఎందుకు వచ్చింది?

సాధారణ నమ్మకం: ముఖ్యంగా నల్ల పిల్లి దారికి అడ్డంగా వెళ్తే పనులు చెడిపోతాయని రోడ్డుపైనే బండ్లు ఆపేస్తుంటారు. దీనివెనుకున్న అసలు కారణం ఏంటంటే.. పూర్వకాలంలో ప్రజలు రాత్రి వేళల్లో గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లపై అడవులు, నిర్మానుష్య ప్రాంతాల గుండా ప్రయాణించేవారు. పిల్లుల జాతికి చెందిన చిరుత పులులు, అడవి పిల్లుల కళ్లు చీకట్లో మెరుస్తుంటాయి. వాటిని చూడగానే ఎద్దులు లేదా గుర్రాలు భయపడి బెదిరిపోయేవి. బండి బోల్తా పడి ప్రమాదాలు జరిగేవి. అందుకే దారిలో పెద్ద పిల్లి జాతి జంతువులు కనిపిస్తే కాసేపు బండిని ఆపి, అవి వెళ్లిపోయేంతవరకు వేచి చూసేవారు. కాలక్రమేణా అది వీధి పిల్లులకు, మూఢనమ్మకాలకు దారితీసింది.

సాయంత్రం లేదా రాత్రి పూట గోళ్లు ఎందుకు కత్తిరించకూడదు?

చీకటి పడ్డాక గోళ్లు తీస్తే దరిద్రం చుట్టుకుంటుందని, లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని చెబుతారు. దీని వెనుకున్న అసలు కారణం.. ప్రాచీన కాలంలో నేటిలాగా నెయిల్ కట్టర్లు లేవు, ఇంట్లో విద్యుత్ బల్బులు ఉండేవి కావు. దీపాల వెలుగులో కత్తులు, బ్లేడ్లతో గోళ్లు తీసేవారు. చీకట్లో చేతి వేళ్లు తెగి గాయాలయ్యే ప్రమాదం ఉండేది. అంతేకాకుండా తెగిన గోళ్లు ఇంట్లో ఆహార పదార్థాల్లో పడే అవకాశం ఉండేది. ఈ ప్రమాదాలను నివారించడానికే రాత్రిపూట గోళ్లు తీయకూడదనే నిబంధన పెట్టారు.

అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం చేయడం

శ్మశానానికి వెళ్లొస్తే అశుభమని స్నానం చేయిస్తారు. దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే.. ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరం వేగంగా డీకంపోజ్ అవ్వడం మొదలవుతుంది. మృతదేహం చుట్టూ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు చేరుతాయి. అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు ఆ సూక్ష్మక్రిములు మన బట్టలు, శరీరంపై చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ కాలంలో వ్యాక్సిన్లు, శానిటైజర్లు లేవు. ఆ క్రిములు ఇంట్లోని పిల్లలకు, వృద్ధులకు సోకకుండా ఉండేందుకే బట్టలతో సహా బావి దగ్గరే స్నానం చేసి ఇంట్లోకి రావాలనే ఆరోగ్య నియమాన్ని పెట్టారు.

గర్భిణీ గ్రహణ సమయంలో బయటకు రాకూడదా?

గ్రహణం సమయంలో గర్భిణులు బయటకు వస్తే పుట్టబోయే బిడ్డలకు లోపాలు వస్తాయని నమ్ముతారు. దీన్ని వెనుకున్న అసలు సైన్స్ ఏంటంటే.. సూర్యగ్రహణం సమయంలో వెలువడే తీవ్రమైన అతినీలలోహితకిరణాలు కళ్లను తీవ్రంగా దెబ్బతీస్తాయి. నేరుగా సూర్యుడిని చూస్తే శాశ్వతంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. గర్భిణులు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలని రక్షణ కోసం చెప్పిన నిబంధన క్రమంగా జ్యోతిష్య అపోహగా మారింది.

Follow Us
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!
రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!
క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్
క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు