AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: జూలై నెలంతా ఆ రాశుల వారు జరభద్రం.. ఊహించని నష్టాలు, చిక్కులు!

Venus Transit 2026: జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు శుక్రడుు సింహరాశిలో సంచారం చేయబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. ఊహించని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కొన్ని వారు స్త్రీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనవసర ఖర్చులు పెరగడం, మోసపోవడం, నష్టపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది.

Astrology: జూలై నెలంతా ఆ రాశుల వారు జరభద్రం.. ఊహించని నష్టాలు, చిక్కులు!
Venus Transit In Leo
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 07, 2026 | 12:22 PM

Share

జూలై 4 నుంచి ఆగస్టు 1వరకు సింహరాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహ సంచారంలో శుక్రుడికి 3, 6, 7, 8, 10, 12 స్థానాలు ఏమంత మంచివి కావని, ఊహించని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారు స్త్రీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనవసర ఖర్చులు పెరగడం, అనవసర పరిచయాలు ఏర్పడడం, మోసపోవడం, నష్టపోవడం వంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

  1. మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడి వల్ల మిత్రుల వల్ల ఎక్కువగా మోస పోవడం, నష్టపోవడం, అప్రతిష్ఠపాలు కావడం జరుగుతుంది. అనవసర వ్యయాల కారణంగా అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు బాగా ఇబ్బంది పెడతాయి. ఆశాభంగాలు కలుగుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది.
  2. కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల అదృష్టాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. అనవసర పరిచయాల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మాటకు విలువ తగ్గుతుంది. మహిళా బంధువుల వల్ల నిందలు పడడం జరుగుతుంది. మిత్రుల వల్ల బాగా ధన నష్టం జరుగుతుంది.
  3. వృశ్చికం: ఈ రాశికి సప్తమ, వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో చేరడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మాత్రం ప్రాధాన్యం, ప్రాభవం కోల్పోవడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు, సహచరుల వల్ల బాగా ఒత్తిడికి గురవుతారు. రావలసిన ప్రమోషన్ ఆగిపోవడం, జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం వంటి వాటి వల్ల ఆశాభంగం చెందుతారు. పెళ్లి ప్రయత్నాలు విఫలమవుతాయి. మిత్రుల వల్ల నష్టపోతారు.
  4. మకరం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. చికాకులు పెరుగుతాయి. పిల్లల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకానికి దూరమవుతారు. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభం: ఈ రాశికి సప్తమంలో శుక్ర సంచారం వల్ల దాంపత్య జీవితంలోనే కాక, కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలకు గ్రహణం పడుతుంది. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో మోసపోవడం లేదా నష్టపోవడం జరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు.
  7. మీనం: ఈ రాశికి షష్ట స్థానంలో శుక్ర సంచారం వల్ల మహిళా సహోద్యోగులు, మహిళా స్నేహితులతో విభేదాలు, వివాదాలు తలెత్తుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోవడం, మోసపోవడం, పొర పాట్లు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కుటుంబ జీవితంలో అశాంతికి, అసంతృప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి, వేధింపులు అధికమవుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి.

Also Read: వారికి 5 గ్రహాల అనుగ్రహం.. కనీవినీ ఎరుగని ధన యోగాలు, రాజయోగాలు

Follow Us
శుక్రుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..కాస్త జాగ్రత్త..!
శుక్రుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..కాస్త జాగ్రత్త..!
మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ?
మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ?
ఇంట్లో కోతులు,బయట కుక్కలు! అధికారుల చర్యల కోసం ఎదురుచూస్తున్న జనం
ఇంట్లో కోతులు,బయట కుక్కలు! అధికారుల చర్యల కోసం ఎదురుచూస్తున్న జనం
ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్
ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు..!
రూమ్‌లోకి చొరబడిన భారీ ఎలుగుబంటి.. హోటల్ గెస్ట్‌కు ఊహించని షాక్..
రూమ్‌లోకి చొరబడిన భారీ ఎలుగుబంటి.. హోటల్ గెస్ట్‌కు ఊహించని షాక్..
క్యాన్సర్ లక్షణాలపై అవగాహన, వైద్యుల సలహా తప్పనిసరి
క్యాన్సర్ లక్షణాలపై అవగాహన, వైద్యుల సలహా తప్పనిసరి
తెలంగాణలో కిచెన్.. మహారాష్ట్రలో బెడ్‌రూమ్.. ఈ వింత ఇల్లు..
తెలంగాణలో కిచెన్.. మహారాష్ట్రలో బెడ్‌రూమ్.. ఈ వింత ఇల్లు..
ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!!
ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!!
ఫుల్లుగా తాగించి భర్తను శాశ్వతంగా పడుకోబెట్టింది..
ఫుల్లుగా తాగించి భర్తను శాశ్వతంగా పడుకోబెట్టింది..