AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Vakri 2026: శని వక్రగతి.. వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం..!

Saturn Retrograde 2026: జూలై 27, 2026 నుంచి ప్రారంభమయ్యే శని వక్రగతి జ్యోతిష్య పరంగా కీలకమైన గ్రహ మార్పుగా భావిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కొత్త సవాళ్లు ఎదురుకాగా.. మరికొన్ని రాశులకు కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి లభించే అవకాశముంది. శని వక్రగతి ప్రభావంతో వృశ్చిక, మీన, మరక రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, ఆదాయ వృద్ధి, నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు అంచనావేస్తున్నారు.

Shani Vakri 2026: శని వక్రగతి.. వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం..!
Shani Vakri 2026
Janardhan Veluru
|

Updated on: Jul 06, 2026 | 12:47 PM

Share

జూలై 2026లో జ్యోతిష్య పరంగా అత్యంత ముఖ్యమైన గ్రహ సంచారాల్లో శని వక్రగతి (తిరోగమనం) కూడా ఒకటి. జూలై 27 నుంచి శనీశ్వరుడు వక్ర గమనాన్ని ప్రారంభించనున్నట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శని వక్రగతి ప్రభావం ఒక్కో రాశిపై ఒక్కో రకమైన అనుకూల, ప్రతికూల ప్రభావాలను చూపనుంది. కొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదురైతే, మరికొందరికి అనూహ్యమైన అవకాశాలు, ఆర్థిక పురోగతి, ఉద్యోగ విజయాలు లభించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఏల్నాటి శని ప్రభావంలో ఉన్న కొందరు కూడా ఈ వక్రగతి సమయంలో తమ కృషికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. శని వక్రగతి ప్రభావంతో లబ్ధిపొందే ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి

శని వక్రగతి వల్ల అత్యధిక ప్రయోజనం పొందే రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి. వీరికి ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే అవకాశముంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. సహోద్యోగులు, కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమై విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి.గతంలో మొదలుపెట్టిన పెండింగ్ పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మీన రాశి

ఈ రాశి వారికి కూడా ఈ శని వక్ర గమనం అనుకూల ఫలితాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు లభించవచ్చు. కష్టపడి చేసిన పనికి తగిన గుర్తింపు, ఫలితం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏల్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ క్రమశిక్షణతో ముందుకు సాగిన వారికి శుభఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది.

మకర రాశి

శని స్వరాశి మకర రాశి వారికి కూడా ఈ వక్రగతి శుభప్రదంగా ఉండే అవకాశముంది. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొత్త అవకాశాలు, కెరీర్ పురోగతి లభించే అవకాశం ఉంది. అదృష్టం కలిసి రావడంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

శని వక్రగతి సమయంలో ఏమి చేయాలి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అనుగ్రహం పొందేందుకు ఈ సమయంలో క్రమశిక్షణతో వ్యవహరించడం, నిజాయితీగా పనులు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే అవసరమైన వారికి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం వంటి మంచి అలవాట్లు పాటించడం శ్రేయస్కరంగా భావిస్తారు.

(ఈ కథనం జ్యోతిష్య విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచార ఆధారంగా రూపొందించబడింది. జ్యోతిష్య అంచనాలు శాస్త్రీయంగా నిర్ధారించబడిన అంశం కాదు. వ్యక్తిగత జాతకం, దశలు, గ్రహస్థితులు వంటి అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు)

Follow Us