AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: శుక్రుడిపై కుజుడి దృష్టి.. ఆ రాశులకు విపరీతమైన ధనలాభం, లగ్జరీ లైఫ్!

శుక్రుడిపై కుజుడి దృష్టి ప్రభావంతో జూన్ 4 నుంచి ఆగస్టు 1 వరకు ప్రేమ, వివాహ ప్రయత్నాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, గృహం, కుటుంబం, సంతానం వంటి విషయాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

Astrology: శుక్రుడిపై కుజుడి దృష్టి.. ఆ రాశులకు విపరీతమైన ధనలాభం, లగ్జరీ లైఫ్!
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2026 | 6:32 PM

Share

జూన్ 4 (శనివారం) నుంచి ఆగస్టు 1 వరకు సింహ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడిని వృషభ రాశి నుంచి కుజుడు వీక్షించడం జరుగుతోంది. శుక్రుడి మీద కుజుడి దృష్టి పడడం వల్ల అవివాహితులకు పెళ్లి మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. పెళ్లి చేసుకోదలచుకోనివారికి కూడా పెళ్లి మీద ఆసక్తి పెరుగు తుంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఆశలు, కోరికలు బాగా పెరుగు తాయి. తమ లక్ష్యాలను ఏదో విధంగా సాధించు కోవాలన్న పట్టుదల వృద్ధి చెందుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారికి ధనం, ఉద్యోగం, గృహం, కుటుంబం, సంతానం వంటివి వృద్ధి చెందుతాయి.

మేషం

కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల ఈ రాశివారు పెళ్లి ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. ఈ రాశివారికి త్వరలో పెళ్లయ్యే యోగం ఉంది. ఈ రాశికి చెందిన యువతీ యువకులకు పెళ్లి మీద ఆసక్తి పెరుగుతుంది. పెళ్లి చేసుకోదలచుకోనివారికి కూడా పెళ్లి మీద మోజు పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఆస్తి లాభం కలుగు తుంది.

వృషభం

ఈ రాశిలో ఉన్న కుజుడు చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి పెళ్లి సంబంధం కుదరడం గానీ, వీరు ప్రేమలో పడడం గానీ తప్పకుండా జరుగుతుంది. వీరికి కోరికలు, ఆశలు విజృంభిస్తాయి. స్వల్ప ప్రయత్నంతో వీరికి మంచి సంపన్న సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. రావాల్సిన డబ్బంతా చేతికి అందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

ఈ రాశికి కుటుంబ స్థానంలో ఉన్న శుక్రుడిని లాభ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తితో త్వరలో పెళ్లయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారికి పెళ్లి మీదా, ప్రేమల మీదా మోజు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.

Also Read: ఈ రాశులకు శుక్ర దశ.. ఇక వారికి పట్టిందల్లా బంగారమే..!

తుల

లాభ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడి మీద కుజుడి దృష్టి పడడం వల్ల ఈ రాశివారి పెళ్లి ప్రయ త్నాలు, ప్రేమ వ్యవహారాలు తప్పకుండా విజయవంతమవుతాయి. రాజయోగాలు, ధనయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగు తుంది. ప్రముఖులుగా గుర్తింపు పొందుతారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.

వృశ్చికం

రాశ్యధిపతి కుజుడికి, శుక్రుడికి పరస్పర కేంద్ర స్థితి ఏర్పడడం వల్ల పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఉంది. అవివాహితుల్లో పెళ్లి చేసుకోవాలనే కోరిక పెరుగుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

కుంభం

ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల ఉన్నతస్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగం కూడా పడుతుంది. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి.

Also Read: శుక్రుడి కటాక్షం.. వారికి ఉద్యోగ పదోన్నతులు ఖాయం..!

Follow Us