AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఆ 4 రాశుల వారికి ముక్కు మీద కోపం.. కానీ మనసంతా వెన్న!

మన చుట్టూ ఉండే వారిలో కొందరిని గమనిస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఓపికగా భరిస్తారు. కానీ, మరికొందరు మాత్రం చిన్న విషయానికే విపరీతమైన కోపంతో ఊగిపోతుంటారు. వారి ప్రవర్తన చూసి చాలా మంది వారు చెడ్డవారేమో అని తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క కోపం, ప్రశాంతత అనేవి వారి రాశి మరియు గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటాయి.

Phani CH
|

Updated on: Jul 02, 2026 | 1:27 PM

Share
కొన్ని రాశుల వారికి ముక్కు మీదే కోపం ఉన్నప్పటికీ, వారి అంతరంగం మాత్రం ఎంతో మనస్సు కలిగి ఉంటారని, ఎవరికీ కీడు చేయాలనే ఆలోచన వారికి ఉండదని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ ప్రత్యేకమైన నాలుగు రాశుల గురించిన ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఈ జాబితాలో మొదటి రాశి 'మేష రాశి'. మేష రాశికి అధిపతి అంగారకుడు (కుజుడు). కుజుడు అగ్ని తత్వానికి, పరాక్రమానికి ప్రతీక. అందుకే ఈ రాశి వారికి చిన్న ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో కోపం వచ్చేస్తుంది. వీరు కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తారు. కానీ, వీరి కోపం ఎంత వేగంగా వస్తుందో, అంతకంటే వేగంగా తగ్గిపోతుంది. మనస్సులో ఎలాంటి కపటం లేకుండా, ఎవరినైనా క్షమించడంలో వీరు ముందుంటారు.

2 / 5
రెండవది 'సింహ రాశి'. సింహ రాశికి అధిపతి సూర్యుడు. వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తమ గౌరవానికి భంగం వాటిల్లినా లేదా అనుకున్న పని సకాలంలో జరగకపోయినా వీరు తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. కానీ, అవతలి వారిపై ప్రేమను చూపించడంలో, సహాయం చేయడంలో వీరిని మించిన వారు ఉండరు.

3 / 5
మూడవ రాశి 'వృశ్చిక రాశి'. వృశ్చిక రాశి వారు తమ కోపాన్ని అంత త్వరగా బయట పెట్టరు, కానీ ఒకసారి కోపం వస్తే మాత్రం దానిని అదుపు చేయడం ఎవరి తరం కాదు. వీరు అన్యాయాన్ని అస్సలు సహించలేరు. అయితే, తమను నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇచ్చే గుణం వీరి సొంతం.

4 / 5
ఇక నాల్గవది 'ధనుస్సు రాశి'. బృహస్పతి అధిపతిగా ఉండే ఈ రాశి వారు చాలా నిష్కల్మషమైన వారు. వీరు అబద్ధాలను, మోసాలను అస్సలు ఇష్టపడరు. ఎవరైనా తప్పు చేస్తే ముక్కుసూటిగా ముఖం మీదే కోపపడతారు. ఈ నాలుగు రాశుల వారిలో ఉండే ఉమ్మడి లక్షణం ఏంటంటే, వీరు పైకి ఎంత కఠినంగా, కోపంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో మృదు స్వభావులు.

5 / 5
Follow Us