AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Blessings: ఈ రాశులకు రాహువు కటాక్షం.. భోగభాగ్యాలు, ధనలాభాలు ఖాయం..!

Venus Transit in Leo 2026: జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు సింహరాశిలో సంచరించే శుక్రుడు.. కుంభరాశిలోని రాహువును వీక్షించబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి విశేష శుభఫలితాలు కలగనున్నాయి. విదేశీ అవకాశాలు, ఆర్థిక లాభాలు, భోగభాగ్యాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

Rahu Blessings: ఈ రాశులకు రాహువు కటాక్షం.. భోగభాగ్యాలు, ధనలాభాలు ఖాయం..!
Rahu Blessings
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 02, 2026 | 7:43 PM

Share

జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు శుక్ర గ్రహం సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశి నుంచి శుక్రుడు కుంభ రాశిలో ఉన్న రాహు గ్రహాన్ని వీక్షించడం జరుగుతుంది. ఈ రాహువు శుక్రుడికి శిష్యుడు. విదేశాలకు కారకుడైన రాహువుకు తన గురువైన శుక్రుడి అనుగ్రహం కలగడంతో అది కొన్ని రాశులకు భోగభాగ్యాలను, విదేశీ సంపాదనను ప్రసాదించే అవకాశం ఉంది. శుక్రుడు ఇవ్వాల్సిన ఫలితాలను రాహువు ఇవ్వడం జరుగుతుంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు ఈ రాహువు వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువును శుక్రుడు వీక్షించడం వల్ల ఈ రాశివారు ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉన్నత విద్యలకు, ఆధునిక నైపుణ్యా లకు, వృత్తి, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. వీరిలో యాక్టివిటీ బాగా పెరుగు తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారు వ్యాపారాల్లో ప్రవేశించడం, వృత్తుల్లో ఉన్నవారు తమ వృత్తిని వ్యాపారం స్థాయికి తీసుకు వెళ్లడం వంటివి జరుగుతాయి. వీరు సంపన్నులయ్యే అవకాశం ఉంది.
  2. వృషభం: చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉన్న రాహువును వీక్షించడం వల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పడుతుంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు లభి స్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆకస్మిక థన లాభానికి అవకాశం ఉంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా సఫలం అవుతుంది. విదేశీ విద్యలకు, విదేశీ నైపుణ్యాలకు బాగా అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్న రాహువును వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి బాగా అవకాశం ఉంది. తప్ప కుండా విదేశీయాన యోగం, విదేశీ సంపాదన యోగం కలుగుతాయి. ఉన్నత విద్యలకు, ఆధునిక నైపుణ్యాలకు, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడానికి కూడా అవకాశం ఉంది.
  4. తుల: పంచమ స్థానంలో ఉన్న రాహువును లాభ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడు వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, ప్రాజెక్టుల వల్ల ఇబ్బడిముబ్బడిగా ఆర్థిక లాభాలు కలు గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అపర కుబేరులు కావడం జరుగుతుంది.. కొద్ది ప్రయ త్నంతో తప్పకుండా విదేశీ ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన విదేశీ ఒప్పందాలు కుదురుతాయి.. పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఆశించిన విదేశీ సంబంధం కుదిరే సూచనలున్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు: తృతీయ స్థానంలో ఉన్న రాహువును భాగ్య స్థానం నుంచి శుక్రుడు చూడడం వల్ల విదేశాల్లో ఉన్నత విద్యకు, ఉన్నత స్థాయి శిక్షణకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్, షేర్లు వంటివి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు తెచ్చిపెడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆదాయ వృద్ధికి కొత్త ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.
  7. కుంభం: ఈ రాశిలో ఉన్న రాహువును సప్తమ స్థానం నుంచి శుక్రుడు చూడడం వల్ల ఈ రాశికి చెందిన వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అనేక విధా లుగా ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా సంపద కలిసి వస్తుంది. వీరు వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లడం లేదా విదేశాల్లో స్థిరపడడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.

Also Read: అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు

Follow Us
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్