Job Astrology: శుక్రుడి కటాక్షం.. వారికి ఉద్యోగ పదోన్నతులు ఖాయం..!
Venus-Ketu Conjunction in Leo: జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు శుక్రుడు సింహరాశిలో కేతువుతో కలిసి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, కుంభ రాశుల వారికి ఉద్యోగంలో పదోన్నతులు, ప్రభుత్వ గుర్తింపు, ధనలాభం, రాజకీయంగా అనుకూల పరిణామాలు, మనసులోని కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Job Astrology
జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకూ శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న కేతువుతో కలవడం వల్ల శుక్రుడు కొన్ని రాశులకు ఆకస్మిక, అనూహ్య శుభ పరిణామాలను కలగజేసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు తప్పకుండా రాజయోగాలు పడతాయి. రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరి చయాలు పెరగడం, ప్రభుత్వ మూలక ధన లాభం కలగడం, ప్రభుత్వ గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, కుంభ రాశుల వారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.
- మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరు తాయి. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపె ట్టినా విజయం సాధిస్తారు. రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు రవి గ్రహానికి చెందిన సింహ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యో గాల్లో ఉన్నత ఉద్యోగ హోదా లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగు తుంది. ఆర్థికంగా తిరుగులేని స్థాయికి చేరుకుంటారు. పిత్రార్జితం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల, తేలిక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని అనేక విధాలుగా సద్వినియోగం చేయడం జరుగుతుంది. ఇంటాబయటా మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ముఖ్యమైన శుభవార్తలు వినడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశికి దశమాధిపతి అయిన శుక్రుడు ఈ రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల కెరీర్ పరంగా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
- తుల: రాశినాథుడైన శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. రాజకీయాలు, పాలనా రంగాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందడం జరు గుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కెరీర్ పరంగానే కాక, ఆదాయపరంగా కూడా జీవితం ఉచ్ఛ దశకు చేరుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగుతాయి. విదేశాల్లో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యో గులు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యానికి లోటుండదు.
ఇవి కూడా చదవండి
Also Read: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి జూలై మాసఫలాలు
Follow Us



