AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలో 8.3 రేటింగ్

సాధారణంగా ఏదైనా సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ ఒకటి లేదా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వస్తుంది. కానీ ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మాత్రం ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

OTT Movie: ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలో 8.3 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 08, 2026 | 6:45 AM

Share

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో అయితే మాలీవుడ్ సినిమాలకు మస్త్ డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం మలయాళం నుంచి కనీసం ఒకటి రెండు సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. అలా ఈ వారం కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ మూవీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అది కూడా ఒకే టైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే రిలీజైన మలయాళ మిస్టరీ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్‌ మూవీ డోస్ (Dose). అభిలాష్ ఆర్ నాయర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సిజు విల్సన్, జగదీష్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా ఈ శుక్రవారం (జులై 10) నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్, లయన్స్ గేట్ ప్లే.. ఇలా ఏకంగా ఐదు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో డోస్ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా కంటెంట్ మీద ఉన్న విపరీతమైన కాన్ఫిడెన్స్ వల్లే నిర్మాతలు ఈ రేంజ్ మల్టీ-ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీని ఫాలో అయ్యారని తెలుస్తోంది.

డోస్ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఆస్పత్రిలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మరణాల చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. పల్మోనాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ (సిజు విల్సన్) పనిచేసే ఆస్పత్రిలో రోగులు వరుసగా చనిపోతుంటారు. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఈ హత్యలు జరుగుతుంటాయి. చివరకు డాక్టర్ ప్రకాష్ భార్య కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. దీంతో ఆ సైకో కిల్లర్ ఎవరో తెలుసునేందుకు స్వయంగా ప్రకాశే రంగంలోకి దిగుతాడు. ఒక పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు? మరి ఆస్పత్రిలో వరుస హత్యలకు పాల్పడిన ఆ సైకో కిల్లర్ ఎవరు? పోలీసులు అతనిని ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా కథ.

ఇవి కూడా చదవండి

ఐదు ఓటీటీల్లో డోస్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us