Radha Saptami 2023: శ్రీవారి భక్తులకు కన్నుల పండుగే.. ఒకే రోజు సప్త వాహనాలపై తిరుమలేశుడు.. ఎప్పుడంటే

సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా టీటీడీ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తోంది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు

Radha Saptami 2023: శ్రీవారి భక్తులకు కన్నుల పండుగే.. ఒకే రోజు సప్త వాహనాలపై తిరుమలేశుడు.. ఎప్పుడంటే
Ratha Sapthami In Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2023 | 2:55 PM

తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనది. పూజలకు శుభకార్యాలకు మాఘ మాసం విశిష్టమైంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. మాఘమాసంలో మాఘ శుద్ధ సప్తమిని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు పుట్టిన రోజుగా భావించి అత్యంత ఘనంగా హిందువులు జరుపుకుంటారు. ఈ నెల జనవరి 28 వ తేదీన రథసప్తమి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని  సూర్య భగవానుడు పూజలను అందుకుంటున్న అరసవెల్లి సహా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు రథ సప్తమి వేడుకలను రెడీ అవుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా టీటీడీ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తోంది.

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాసునికి ఈ రోజున ఏడు వాహనాల సేవలను ఒకే రోజు నిర్వహిస్తుంది టిటిడి పాలకమండలి. తిరుమాడ వీథులలో స్వామి వారు ఏడు వాహనాలలో ఊరేగుతారు ఊరేగుతారు. ఉదయం సూర్య ప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్ర ప్రభ వాహనంతో ముగుస్తుంది..

రథ సప్తమి వేడుకలు ఆ రోజు ఉదయం సూర్యప్రభ వాహనసేవతో ప్రారంభమై చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవ, హనుమంత వాహనసేవ , కల్పవృక్ష వాహన సేవ ,  సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. రథసప్తమి రోజున ఒకేసారి ఏడు వాహనాలు చూసే అవకాశం ఉండడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుపతికు చేరుకుంటారు. వాహనాలపై ఊరేగుతూ.. భక్తులకు అభయమిచ్చే శ్రీవారిని దర్శించుకుని పులకించి పోతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!