AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo Horoscope 2023: కొత్త ఏడాదిలో సింహ రాశివారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే.. ప్రతి ఒక్కరూ మొదట జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి తమ కెరీర్ , వ్యాపారం గురించి.. తమ కలలు ఎంతకాలంలో నెరవేరతాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2023 లో సింహ రాశికి సంబంధించిన వృత్తి, వ్యాపార వ్యవహారంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.. 

Leo Horoscope 2023: కొత్త ఏడాదిలో సింహ రాశివారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..
Horoscope
Surya Kala
|

Updated on: Jan 03, 2023 | 3:35 PM

Share

ప్రతి ఒక్కరూ జీవితంలో కొత్త సంవత్సరం తాము చేపట్టిన పనుల్లో విజయాలు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ కెరీర్, వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందడానికి చాలా కష్టపడి, కృషి చేస్తారు. అయితే కొన్నిసార్లు వ్యక్తి కన్న కలలను నెరవేరడంలో కొన్ని అడ్డంకులు అవరోధంగా మారతాయి. అటువంటి పరిస్థితిలో.. కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే.. ప్రతి ఒక్కరూ మొదట జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి తమ కెరీర్ , వ్యాపారం గురించి.. తమ కలలు ఎంతకాలంలో నెరవేరతాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2023 లో సింహ రాశికి సంబంధించిన వృత్తి, వ్యాపార వ్యవహారంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం..

కఠోర శ్రమ, కృషితో కల నెరవేరుతుంది జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వ్యాపారస్థులు మూలధన పెట్టుబడికి సంబంధించిన విషయాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి విషయంలో వీరు నమ్మకం వ్యాపారంలో అనుభవం ఉన్న వారితో చర్చించండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పని , ప్రవర్తనపై పూర్తి శ్రద్ధ వహించాలి. చిన్న పొరపాటు కూడా ఈ రాశివారిని టెన్షన్‌కు గురి చేస్తుంది. ఈ రాశివారు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే.. ఆ ప్రయత్నాలను తగ్గించుకోకండి. లేకుంటే అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. కొన్ని ప్రయాణాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ప్రయాణాలు లాభదాయకంగా ఉండవు.

ఏ నెలల్లో కెరీర్ వ్యాపారంలో సక్సెస్ అందుకుంటారంటే  మే నుండి డిసెంబరు వరకు ఉద్యోగస్థులకు, వ్యాపారాస్తులకు  చాలా ఫలవంతంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే ప్రయత్నాలు  శుభ ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్థులు తమ పై అధికారులు, సహోద్యోగులతో మంచి బంధాన్ని కలిగి ఉంటారు. కొన్ని కొత్త అసైన్‌మెంట్‌లను కూడా పొందుతారు. పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

వ్యాపారవేత్తలకు.. ఈ సమయం చాలా మంచిది. ఈ కాలంలో మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే.. దానిలో కూడా విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారం లేదా మరేదైనా స్టార్టప్ మొదలైనవాటి కోసం ప్లాన్ చేస్తున్న వారు కూడా తమ లక్ష్యాలను ఈజీగా సాధిస్తారు.    ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. నిస్సందేహంగా ఈ రాశివారి ఆదాయం కూడా పెరుగుతుంది. బిజీగా ఉండి కూల్‌గా ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)