AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ దిక్కుకు ఎదురుగా కూర్చుని అస్సలు భోజనం చేయకూడదు.. అలా చేస్తే దరిద్రం ఖాయం..!

తినేటప్పుడు, మన జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పొరపాటు, అవగాహన రాహిత్యం కారణంగా మనం కొన్ని తప్పులు చేస్తుంటాము. అలాంటి చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి

Vastu Tips: ఈ దిక్కుకు ఎదురుగా కూర్చుని అస్సలు భోజనం చేయకూడదు.. అలా చేస్తే దరిద్రం ఖాయం..!
Eat Food
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2023 | 4:58 PM

Share

వాస్తు శాస్త్రం అంటే ఇంట్లో చేసే పనులన్నింటిలో మంచి చెడులు చెప్పే శాస్త్రం. వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో అమర్చే వస్తువుల వరకు అన్నింటి సమాచారాన్ని అందిస్తుంది. మనం ఇంట్లో ఏ దిశలో కూర్చోవాలి ఏ దిశలో కూర్చుని, ఏ దిక్కున చూస్తూ ఆహారం తినాలో కూడా చెబుతుంది. వాస్తు శాస్త్రంలో ప్రకృతి నియమాలు, నిర్దిష్ట దిశలు నిర్దేశించబడ్డాయి. తినేటప్పుడు, మన జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పొరపాటు, అవగాహన రాహిత్యం కారణంగా మనం కొన్ని తప్పులు చేస్తుంటాము. అలాంటి చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఆ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం..

దక్షిణ దిక్కుకు ముఖం పెట్టి ఆహారాన్ని తినకూడదు. తినే సమయంలో మీరు ఏ దిక్కున కూర్చుంటున్నారో చూసుకోండి. లేదంటే, మీ ఆరోగ్యం పాడవుతుంది. వాస్తు నియమాల ప్రకారం, దక్షిణ దిక్కును చూస్తూ ఆహారం తినకూడదని చెబుతారు. దక్షిణ దిక్కును యమ దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో భోజనం చేయడం వల్ల ఆయుష్షు తగ్గుతుంది. కాబట్టి, దక్షిణ దిశలో కూర్చుని ఆహారాన్ని తినడం తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మంచం మీద కూర్చుని తినకూడదు.. మంచం మీద కూర్చొని ఎప్పుడూ ఆహారం తినకూడదు. దీంతో ఇంట్లో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. వ్యక్తిపై ఖర్చులు, అప్పులు పెరుగుతాయి. అందువల్లే మంచం మీద కూర్చొని పొరపాటున కూడా భోజనం చేయకూడదు.

ఇవి కూడా చదవండి

ఉత్తరం- తూర్పు దిశలలో కూర్చొని ఆహారం తినండి.. ఉత్తరం,తూర్పు దిశలో కూర్చొని ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఉత్తర, తూర్పు ఈ రెండు దిక్కులను భగవంతుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశలో ఆహారం తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. వ్యక్తి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాడు. తూర్పు దిశలో ఆహారం తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వ్యాధుల నుండి విముక్తి పొందుతారు.

ఆహారాన్ని వృధా చేయవద్దు.. ఒక ప్లేట్‌లో మీరు తినగలిగినంత ఆహారమే వడ్డించుకోండి. ప్లేట్‌లో ఆహారాన్ని వదిలివేయడం ఆహారాన్ని అగౌరవపరచడమే అవుతుంది. ఇది డబ్బు, ఆహార కొరతకు దారితీస్తుంది. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్‌లో మిగిల్చకూడదు.

మట్టి కుండ ఉపయోగించండి.. మన గ్రంధాలలో మట్టి కుండ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మట్టి కుండలో వండుకుని తింటే 100 శాతం పోషకాలు అందుతాయి. ఆరోగ్యంతోనే అదృష్టం వస్తుందని కూడా అంటారు.

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి