Viral news: రైల్లో ప్రయాణిస్తుండగా ఎలుక కాటుకు గురైన మహిళ.. రూ.20,000 పరిహారం..ఇంకా..

కాచిగూడ నుండి వడకరకు రైలు ప్రయాణంలో ఎలుక కాటుకు గురైంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె తన బెర్త్‌పై నిద్రిస్తుండగా, ఎలుక ఆమె ఎడమ చేతిని కొరికింది.

Viral news: రైల్లో ప్రయాణిస్తుండగా ఎలుక కాటుకు గురైన మహిళ.. రూ.20,000 పరిహారం..ఇంకా..
Rat
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 19, 2023 | 4:25 PM

రైల్వేలో ఎలుకల బెడద మామూలుగా ఉండదు. రైల్వే స్టేషన్లు, పట్టాలవెంబడి ఎలుక చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ప్లాట్‌ఫామ్‌పై నిల్చుని చూస్తున్న వారు భయంతో పరిగెత్తెలా చేస్తుంటాయి ఎలుకలు. అంతేకాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో రైల్లో కూడా ఎలుకలు హంగామా చేస్తుంటాయి. అలాంటిదే ఒక రైలులో ఓ మహిళా ప్యాసింజర్ ను ఎలుక కొరికింది. దీంతో ఆమె ఎంతో ఇబ్బంది పడ్డారు. రైల్వే శాఖ అధికారులు వెంటనే స్పందించి మహిళకు తగిన చికిత్స అందించారు. కాగా, బాధిత మహిళ న్యాయం చోసం వినియోగదారుల ఫోరమును ఆశ్రయించగా..అసౌకర్యానికి లోనైన ప్యాసింజర్ కు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఇండియన్ రైల్వేని కేరళ రాష్ట్రం కోజికోడ్‌ జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశించింది. వివరాల్లోకి వెళ్లితే..

రైలులో ప్రయాణిస్తుండగా ఎలుక కాటుకు గురైన ఓ ప్రయాణికుడికి రూ.20,000 పరిహారం మంజూరు చేయాలని కోజికోడ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ భారతీయ రైల్వేని ఆదేశించింది. ఫిర్యాదుదారు చోరోడ్‌కు చెందిన సాలీ జేమ్స్ 2016లో కాచిగూడ నుండి వడకరకు రైలు ప్రయాణంలో ఎలుక కాటుకు గురైంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె తన బెర్త్‌పై నిద్రిస్తుండగా, ఎలుక ఆమె ఎడమ చేతిని కొరికింది. షోర్నూర్‌ స్టేషన్‌లో రైలు ఆగడంతో ఆమె ఈ విషయాన్ని టీటీఈకి నివేదించింది. రైల్వే డాక్టర్ రాగానే వ్యాక్సిన్‌ వేసి ఇంట్రాడెర్మల్‌ రేబీస్‌ వ్యాక్సిన్‌ వేయమని చెప్పాడు. అనంతరం వడకర సహకార ఆసుపత్రిలో చికిత్స పొందింది.

ఫిర్యాదుదారు ప్రయాణించిన రెండో ఏసీ కోచ్‌ను పూర్తిగా శుభ్రం చేశారని, బయటి నుంచి ఎలుక లగేజీలోకి ప్రవేశించి ఉండవచ్చని రైల్వే వాదించింది. అయితే, రైల్వే నిర్లక్ష్యం, నాసిరకం సర్వీస్ కారణంగా ఫిర్యాదుదారు ఎలుక కాటుకు గురయ్యాడని కమిషన్ గమనించింది. 20,000 పరిహారంతో పాటు, ఆమె చికిత్స ఖర్చులకు మరో రూ.1,000లు, ఇంకా మందులు, ఆహారం ఖర్చుల కోసం రూ. 2,000 మంజూరు చేయాలని కమిషన్ రైల్వేని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..