AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Ticket Refund: రైలు టికెట్ రద్దు చేసుకుంటున్నారా? రీఫండ్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..!

రద్దు చేసుకున్న టికెట్ కు రైల్వే శాఖ మన డబ్బును రీఫండ్ చేస్తుంది. కానీ, టికెట్ బుక్ చేసుకునే సమయంలో చెల్లించిన మొత్తం కంటే తక్కువగా మనకు డబ్బులను ఇస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల చార్జీలను మినహాయించుకుని రిఫండ్ చేస్తుంది. ఇది టికెట్ బుకింగ్ సమయంలోనే ఆ నియమాలను సరి చూసుకోవాల్సి ఉంటుంది.

Train Ticket Refund: రైలు టికెట్ రద్దు చేసుకుంటున్నారా? రీఫండ్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..!
Indian Railways
Nikhil
| Edited By: |

Updated on: Jan 19, 2023 | 6:08 PM

Share

దూర ప్రాంతాలకు ప్రయాణించాలనుకుంటే రైలులో ప్రయాణించడానికే అందరూ మొగ్గుచూపుతారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ చూసి మనం నిరుత్సాహ పడుతుంటాం. అలాగే టిక్కెట్ కన్ ఫాం అవుతుందనే ఉద్దేశంతో బుక్ చేసేస్తుంటాం. కొన్ని అనుకోని సమయాల్లో అయితే కన్ ఫాం అయిన టిక్కెట్ నే రద్దు చేసేస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో రద్దు చేసుకున్న టికెట్ కు రైల్వే శాఖ మన డబ్బును రీఫండ్ చేస్తుంది. కానీ, టికెట్ బుక్ చేసుకునే సమయంలో చెల్లించిన మొత్తం కంటే తక్కువగా మనకు డబ్బులను ఇస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల చార్జీలను మినహాయించుకుని మిగిలిన సొమ్మును మనకు చెల్లిస్తుంది. ఇది టికెట్ బుకింగ్ సమయంలోనే ఆ నియమాలను సరి చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా టికెట్ రీఫండ్ విషయంలో మనం తెలుసుకోవాల్సిన పాయింట్లను ఓ సారి చూద్దాం. 

టికెట్ రీఫండ్ లో ముఖ్యమైన రూల్స్ ఇవే

రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు కన్ ఫాం అయిన టికెట్ ను రద్దు చేసుకుంటే రీఫండ్ చార్జీలు ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ/ ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు రూ.240. ఏసీ టూ టైర్ ప్రయాణికులకు రూ.200. త్రీటైర్ ఏసీ/ఏసీ చైర్ కార్ ప్రయాణికులకు రూ.180. సెకండ్ క్లాస్ ప్రయాణికులకు రూ.60 క్యాన్సిలేషన్ చార్జీల కింద రైల్వే శాఖ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ప్రయాణికులకు చెల్లిస్తుంది. అయితే రైలు బయలుదేరడానికి 12 గంటల ముందు టికెట్ ను రద్దు చేసుకుంటే ప్రయాణ చార్జిలో 25 శాతం, 4 గంట ముందు రద్దు చేసుకుంటే 50 శాతం క్యాన్సిలేషన్ చార్జీల కింద రైల్వే శాఖ మినహాయించుకుంటుంది. అయితే ఆర్ ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు రైలు బయలుదేరే అరగంట ముందు రద్చేదు సుకుంటే కేవలం క్లరికేజ్ చార్జిని మాత్రమే రైల్వే శాఖ తీసుకుని మిగిలిన డబ్బును ప్రయాణికుడికి అందజేస్తుంది.  

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..