Auto Expo 2023: హ్యుందాయ్ ఐ 20కు పోటీగా కొత్త కారు విడుదల చేసిన టాటా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా కూడా తన కొత్త మోడల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆల్డ్రోజ్ రేసర్ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ కార్ వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Auto Expo 2023: హ్యుందాయ్ ఐ 20కు పోటీగా కొత్త కారు విడుదల చేసిన టాటా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..!
Tata Altroz Racer
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 19, 2023 | 6:22 PM

గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో 2023 లో వివిధ మోటార్ కంపెనీలు తమ కొత్త మోడల్స్ ను ప్రదర్శిస్తున్నాయి. వాటిల్లో కొన్ని కాన్సెప్ట్ స్థాయిల్లో ఉంటే మరికొన్ని ఎప్పుడు ప్రారంభిస్తామనేది చెబతున్నారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా కూడా తన కొత్త మోడల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆల్డ్రోజ్ రేసర్ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ కార్ వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకోవాల్సిన ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి? అసలు దీని ఫీచర్స్ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం

ఆల్ట్రోజ్ రేసర్ పెట్రోల్ తో పని చేస్తుంది. 120 బీహెచ్ పీ పవర్, 170 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ అవుట్ పుట్ ఆల్ట్రోజ్ ఐ టర్బో కంటే ఎక్కువ. అలాగే ఈ కార్ ను 6 గేర్లతో అప్ గ్రేడ్ చేశారు. దీంతో పాటు కార్ స్పోర్టీ లుక్ తో డిజైన్ చేశారు. అలాగే ఇంటిరియర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. హెడ్ రెస్ట్ లు, డ్యాష్ బోర్డ్ కూడా ప్రీమియం లుక్ తో ఉంటుంది. ఈ కార్ ను ఈ సంవత్సరంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంటీరియర్ లో వచ్చే టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఒకే సారి రెండు మూడు విషయాలను తెలుసుకునేలా డిజైన్ చేశారు. డిజిటర్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్,  ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆరు ఎయిర్ బ్యాగ్ లు, వెంటిలేటెడ్ సీట్లతో ఇది కచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీని రేట్ ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అలాగే ఇది హ్యూండాయ్ ఐ 20 కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..