Auto expo 2023: టాప్ గేర్‌లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ.. ఒకేసారి మూడు ఈ-బైక్‌లతో సెన్సేషన్..

ప్రపంచ మార్కెట్ లో తన సత్తా చాటేందుకు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే యాంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారతదేశ మార్కెట్లోకి విడుదల చేయడంతోపాటు మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్ళు ఎన్ఎక్స్ జీ, ఎన్ఎక్స్ యూ లను ప్రదర్శించింది.

Auto expo 2023: టాప్ గేర్‌లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ.. ఒకేసారి మూడు ఈ-బైక్‌లతో సెన్సేషన్..
Ampere Primus
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2023 | 7:00 AM

దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. దీనికి ఆటో ఎక్స్ పో 2023 వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించాయి. దీనిలో భాగంగానే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపియర్ ప్రైమస్ ను ఆవిష్కరించింది. అలాగే మరో రెండు మోడళ్లను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ మార్కెట్ పై దృష్టి..

ప్రపంచ మార్కెట్ లో తన సత్తా చాటేందుకు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే యాంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారతదేశ మార్కెట్లోకి విడుదల చేయడంతోపాటు మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్ళు ఎన్ఎక్స్ జీ, ఎన్ఎక్స్ యూ లను ప్రదర్శించింది.

యాంపియర్ లో స్పెక్ లు ఇలా..

కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్ అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా రూపొందించారు. హై స్పీడ్ వేరియంట్లో ఇది వస్తోంది. దీనిలో 3 kwh ఎల్ఎఫ్పీ బ్యాటరీ టెక్నాలజీతోపాటు స్మార్ట్ బీఎంఎస్ ఫేస్ 1, ఏఐఎస్ 156 కంప్లైంట్ తో వస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు కాగా.. కేవలం ఐదు సెకన్లలోనే 0నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకుంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల మైలేజీని ఇది ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు ఇలా..

దీనిలో నాలుగు రైడింగ్ మోడ్ లు ఉన్నాయి. ఎకో, సిటీ, పవర్, రివర్స్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే బ్లూటూత్ కనెక్టవిటీతో పాటు ఫోన్ యాప్ ద్వారా నావిగేషన్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ స్కూటర్ స్పేషియస్ గా కూడా ఉంటుంది. కాళ్లు పెట్టుకునేందుకు ఎక్కువ రూమ్ ఉంటుంది. ఇది హిమాలయన్ వైట్, రాయల్ ఆరెంజ్, హావ్లాక్ బ్లూ, బక్ బ్లూ వంటి రంగుల్లో లభ్యమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..