Gold Price Today: ఆల్‌టైమ్ రికార్డ్ దిశగా గోల్డ్ ధరలు.. తులం బంగారం రేట్ ఎంతకు చేరిందో తెలిస్తే..
దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఆల్‌టైమ్ రికార్డ్ దిశగా గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం కూడా గోల్డ్ రేట్‌లో పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 210 పెరిగింది...
దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఆల్‌టైమ్ రికార్డ్ దిశగా గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం కూడా గోల్డ్ రేట్‌లో పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 210 పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ. 56,950కి చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 400 పెరిగి రూ. 52,000గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 52,350గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 57,100గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,170 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,000గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,250 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,000 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. * హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 52,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 52,200 24 క్యారెట్స్ ధర రూ. 56,950గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. వెండి ధర కూడా పెరిగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం కిలో వెండిపై రూ. 150 వరకు పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,900గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 72,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,800గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 75,800 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..