AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రూ.6వేలు కాదు.. ఇక నుంచి రూ.8వేలు..!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్ ను 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి

PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రూ.6వేలు కాదు.. ఇక నుంచి రూ.8వేలు..!
లేదా.. PM కిసాన్ యోజన- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ కూడా రైతుల ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 16, 2023 | 9:54 PM

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకుని వచ్చి అమలుచేస్తోంది. దీనిలో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించి రైతులకు చేయూతనందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున.. మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వాయిదాల నగదును రైతులకు అందించగా.. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోందని పేర్కొంటున్నారు. పీఎం కిసాన్ నగదు 6000 వేల నుంచి మరింత పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నగదును పెంచే యోచనలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. వివిధ మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం PM-KISAN పథకం కింద రైతులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక ప్రయోజనాన్ని రూ. 8,000కి పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. 8వేలను అర్హులైన రైతుల ఖాతాలో 4 సమాన వాయిదాలలో పంపిణీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్ ను 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి, నేరుగా రూ.6వేలను రైతుల ఖాతాల్లో జమచేస్తోంది.

PM-KISAN పథకం పొందడానికి ఎవరు అర్హులు?

భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాలు, వారి పేర్లపై సాగు చేయదగిన భూమి ఉన్నవారు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు.

ఇవి కూడా చదవండి

ఈ పథకానికి ఎవరు అర్హులు కాదు..

  • ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాలు ఈ పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదు.
  • అన్ని సంస్థాగత భూమి హక్కుదారులు (సంస్థలు)
  • రాజ్యాంగ పదవులను కలిగి ఉన్నవారు.. మాజీ, ప్రస్తుత మంత్రులు – రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ/ రాజ్యసభ/ రాష్ట్ర శాసనసభలు/ రాష్ట్ర శాసన మండలి మాజీ/ప్రస్తుత సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్‌ల మాజీ, ప్రస్తుత మేయర్‌లు, జిల్లా పంచాయతీల మాజీ, ప్రస్తుత అధ్యక్షులు అర్హులు కాదు.
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులు అర్హులు కాదు. (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు మినహా)
  • నెలవారీ పెన్షన్ రూ.10,000/- లేదా అంతకంటే ఎక్కువ పొందుతున్న వారు అర్హులు కాదు.
  • ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులందరూ అర్హులు కాదు.
  • వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు, పలు ఉద్యోగాలు చేస్తున్నవారు అర్హులు కాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..