Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship: భార్యాభర్తలకు అలెర్ట్.. దాంపత్య జీవితాన్ని నాశనం చేసే ఐదు ప్రధాన కారణాలు ఇవే..

Intimate Life Tips: ప్రస్తుత కాలంలో రిలేషన్‌షిప్ అర్ధాంతరంగా ముగుస్తోంది. చిన్న చిన్న పొరపాట్లతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం.. అది సంబంధం తెగిపోయే వరకు వెళ్లడం లాంటి ఘటనలు పలు కుటుంబాల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Relationship: భార్యాభర్తలకు అలెర్ట్.. దాంపత్య జీవితాన్ని నాశనం చేసే ఐదు ప్రధాన కారణాలు ఇవే..
ప్రస్తుత కాలంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషులు, మహిళలు లైంగిక (లిబిడో-ప్రేరిత) పరమైన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు వంటగదిలో ఉండే పలు రకాల పదార్థాలతో లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని.. సైన్స్ చెబుతోంది. సహజమైన కామోద్దీపనలను ప్రయత్నించడం ద్వారా లైంగిక కోరికలను పెంచుకోవడంతోపాటు పలు సమస్యల నుంచి బయటపడొచ్చు.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 15, 2023 | 8:47 PM

Intimate Life Tips: ప్రస్తుత కాలంలో రిలేషన్‌షిప్ అర్ధాంతరంగా ముగుస్తోంది. చిన్న చిన్న పొరపాట్లతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం.. అది సంబంధం తెగిపోయే వరకు వెళ్లడం లాంటి ఘటనలు పలు కుటుంబాల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని తప్పుల వల్ల దాంపత్య జీవితం బోరింగ్‌గా మారుతుందని.. అది ఫిజికల్ రిలేషన్ పై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య చెడు సన్నిహిత జీవితం కూడా కుటుంబంలో గొడవకు దారి తీస్తుంది. దీంతోపాటు పలు కారణాలు లైంగిక జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అందుకే దాంపత్య జీవితాన్ని పాడుచేసే కారణాలేంటో తెలుసుకోవడం ముఖ్యం. వీటితో ఆ సమస్యలను నివారించేందుకు ప్రయత్నించవచ్చు. భార్యా భర్తల మధ్య సంబంధాన్ని విచ్చిన్నం చేసే విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఒత్తిడి: మీరు ఇంట్లో లేదా ఆఫీసులో ప్రతిదానిపై ఒత్తిడి తీసుకుంటే అది మీ లైంగిక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒత్తిడి వల్ల ఏకాగ్రత ఉండదని నిపుణులు భావిస్తున్నారు. ఇది కార్టిసాల్ స్థాయిని పెంచి మూడ్ కిల్లర్‌గా పనిచేస్తుంది. దీని కారణంగా, టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల నిర్మాణం ఆగిపోతుంది. అందువల్ల, వీలైనంత వరకు ఒత్తిడిని మనస్సుపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోండి..
  2. నిద్ర: నిద్రలేమి అనేక వ్యాధులకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మంచి నిద్ర మీ రోజును మరింత మెరుగుపరుస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల అలసట వస్తుంది. అటువంటి పరిస్థితిలో రోజు చివరిలో శరీరంలో తగినంత శక్తి ఉండదు. దీనివల్ల లైంగిక శక్తి తగ్గడంతోపాటు పలు సమస్యలు కూడా వస్తాయి. దీనిని నివారించడానికి మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. సమయానికి నిద్రపోవడంతోపాటు.. మెరుగైన ఆహారం తీసుకోవాలి.
  3. హార్మోన్లలో సమతుల్యత లోపించడం: సరైన ఆహారం, జీవనశైలి కారణంగా శరీరంలో చాలా సార్లు హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. అసమతుల్య హార్మోన్ల కారణంగా, శారీరక సంబంధం పెట్టుకోవాలన్న కోరిక కలగదు. దీంతో టెస్టోస్టెరాన్ వారి శరీరంలో తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయబడటం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో డాక్టర్ సలహా తీసుకోండి.
  4. దంపతుల మధ్య గొడవ: భార్యాభర్తల మధ్య రోజుకో గొడవ వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే గొడవలు మానుకుని ఒకరినొకరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. కలహాలు తరచూ వస్తే భాగస్వామి గురించి చెడుగా భావిస్తారు. దీన్ని నివారించడానికి రెండింటినీ సమన్వయం చేసుకోవాలి.
  5. శ్రద్ధ వహించండి: ప్రజలు తమ భాగస్వామిని సంతృప్తి పరచలేనప్పుడు చాలా సార్లు ఇది జరుగుతుంది. సాధారణంగా ఇది పురుషులతో జరుగుతుంది. ఇదే జరిగితే, ఇద్దరూ మాట్లాడుకోవాలి.. ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం గురించి ఇద్దరి భావాలను ఒకరినొకరు పంచుకుని దీనికి పుల్‌స్టాప్ పెట్టాలి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
ఎనిమిది సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా పడలేదు..
ఎనిమిది సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా పడలేదు..
Viral Video: ఇద్దరు పిల్లలు పుట్టినంక ప్రియుడితో భార్య యవ్వారం...
Viral Video: ఇద్దరు పిల్లలు పుట్టినంక ప్రియుడితో భార్య యవ్వారం...
అమ్మవారికి నైవేద్యంగా, భక్తులకు ప్రసాదంగా చైనీస్ వంటలు.. ఎందుకంటే
అమ్మవారికి నైవేద్యంగా, భక్తులకు ప్రసాదంగా చైనీస్ వంటలు.. ఎందుకంటే
ఇదో వంద పడకల ఆస్పత్రి..! కానీ, లోపలికి వెళ్లి చూస్తే మాత్రం..!
ఇదో వంద పడకల ఆస్పత్రి..! కానీ, లోపలికి వెళ్లి చూస్తే మాత్రం..!
స్టార్ హీరోయిన్స్ ముద్దు పేర్లు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
స్టార్ హీరోయిన్స్ ముద్దు పేర్లు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?