AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Peas Effects: అలెర్ట్.. ఈ సమస్యలున్న వారు పచ్చి బఠానీలు అస్సలు తినకూడదట.. తింటే ప్రమాదంలో పడినట్లే..

Green Peas Side Effects: వింటర్ సీజన్‌లో మార్కెట్‌లో పచ్చి బఠానీలు (మటర్) ఎక్కువగా లభిస్తాయి. చలికాలం దొరికే కూరగాయల్లో మటర్ ఒకటి.. పచ్చి బఠానీలను కూరతోపాటు పలు రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు.

Green Peas Effects: అలెర్ట్.. ఈ సమస్యలున్న వారు పచ్చి బఠానీలు అస్సలు తినకూడదట.. తింటే ప్రమాదంలో పడినట్లే..
Green Peas In Winter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 15, 2023 | 7:59 PM

Green Peas Side Effects: వింటర్ సీజన్‌లో మార్కెట్‌లో పచ్చి బఠానీలు (మటర్) ఎక్కువగా లభిస్తాయి. చలికాలం దొరికే కూరగాయల్లో మటర్ ఒకటి.. పచ్చి బఠానీలను కూరతోపాటు పలు రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. ఇవి రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మటర్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ సి, కె, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో ఇది అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. అయితే దీని వినియోగం అనారోగ్యానికి గురి చేస్తుందన్న విషయం మీకు తెలుసా..? ఇది అందరి విషయంలో కానప్పటికీ.. పచ్చి బఠానీలను కొందరు మాత్రం అస్సలు తినకూడదని పేర్కొంటున్నారు. పచ్చి బఠానీలను ఎవరు, ఎప్పుడు, ఎందుకు తినకూడదు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సమస్యలున్న వారు పచ్చి బఠానీలు తినకండి..

  1. యూరిక్ యాసిడ్: యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే పచ్చి బఠానీల వినియోగానికి దూరంగా ఉండాలి. బఠానీలలో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు, విటమిన్ డి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది కీళ్లలో నొప్పిని కలిగిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యలను పెంచుతుంది.
  2. ఊబకాయం: మీరు బరువు తగ్గడానికి పగలు, రాత్రి శ్రమిస్తుంటే.. పచ్చి బఠానీలు తినడాన్ని నివారించాలి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే వీటిని అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. బఠానీల్లో పిండి పదార్థాలు బరువును పెంచుతాయని పేర్కొంటున్నారు.
  3. కిడ్నీ సమస్య: కిడ్నీ స్టోన్ లేదా కిడ్నీకి సంబంధించిన మరేదైనా సమస్య ఉంటే.. పచ్చి బఠానీలకు దూరంగా ఉండాలి. ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. ఈ కారణంగానే కిడ్నీ రోగులు పరిమిత పరిమాణంలో బఠానీలను తినడం మంచిది.
  4. గ్యాస్: గ్యాస్ సమస్య ఉన్నా, కడుపు ఉబ్బరం ఉన్నా బఠానీలను తీసుకోవడం మానేయాలి. ఇందులో కార్బోహైడ్రేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సులభంగా జీర్ణం కాదు. ఇప్పటికే మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యతో బాధపడుతుంటే.. బఠానీలను ఎక్కువగా తినకూడదని పేర్కొంటున్నారు.

పచ్చి బఠానీల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నా, ఏదైనా జబ్బుతో బాధపడుతుంటే బఠానీలు తినకూడదని సూచిస్తున్నారు. అయినప్పటికీ, బఠానీలను తినాలనుకుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిదని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..