AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Video: పెళ్లికి ఇలాంటి అమ్మాయే కావాలంటున్న అబ్బాయిలు.. జయమాల సమయంలో వధువు ఏం చేసిందంటే..?

సోషల్ మీడియాలో వధూవరుల క్యూట్ మూమెంట్స్ ప్రతిరోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. పెళ్లికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ, పరస్పరం షేర్ చేసుకుంటుంటారు.

Wedding Video: పెళ్లికి ఇలాంటి అమ్మాయే కావాలంటున్న అబ్బాయిలు.. జయమాల సమయంలో వధువు ఏం చేసిందంటే..?
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jan 14, 2023 | 8:38 PM

Share

సోషల్ మీడియాలో వధూవరుల క్యూట్ మూమెంట్స్ ప్రతిరోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. పెళ్లికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ, పరస్పరం షేర్ చేసుకుంటుంటారు. ఈ వీడియోలను చూసిన తర్వాత చాలామంది నెటిజన్లు నవ్వుకోవడంతోపాటు.. ఆశ్చర్యం వ్యక్తంచేస్తుంటారు. అయితే, చాలాసార్లు పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. వాటిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకున్నారు. తాజాగా.. ఇప్పటివరకు వైరల్ అయిన వాటికి భిన్నంగా.. ఓ క్యూట్ పెళ్లి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు వధువును ప్రశంసించడంతోపాటు.. ఇలాంటి అమ్మాయే జీవితంలో దొరికితే బాగుంటుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

భారతీయ వివాహాల్లో జయమాల వేడుకకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ కాలక్రమేణా వధూవరులు దండలు మార్చుకునే ఈ ఆచారంలో చాలా మార్పులు వచ్చాయి. వధూవరులు ఇప్పుడు ఆ క్షణాన్ని కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకుంటున్నారు. వరమాల సమయంలో వేదికపై నృత్యం చేయడం, ఈ సమయంలో ఒకరినొకరు నెక్లెస్‌లు ధరించడం, స్నేహితులు, వధువు సోదరీమణులు ఇందులో సహాయం చేయడం, ఆటపట్టించడం, ఇలా ఎన్నో మధురానుభూతులతో జరుపుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో.. వేదికపై జైమాల కార్యక్రమానికి వధూవరులు సిద్ధమవుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఇద్దరూ దండలు పట్టుకుని నిల్చొని కనిపిస్తారు. వెంటనే వరుడు కూర్చుంటాడు. అయితే.. వరుడి కాలికి గాయం కావడంతో నిల్చోలేకపోతాడు. దీంతో వరుడు కూర్చొని ఉండగా.. వధువు హారాన్ని వేస్తుంది. ఆ తర్వాత వరుడు దండ వేసే క్రమంలో వధువు కింద కూర్చుంటుంది. దీంతో వరుడు సులభంగా ఆమె మెడలో దండ వేస్తాడు. ఈ సమయంలో వరుడు నిలబడటానికి ప్రయత్నిస్తాడు.. కానీ వధువు వెంటనే వద్దంటూ సూచనలు చేస్తుంది.

వీడియో చూడండి..

ఈ వీడియోను టియాసన్కర్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి వీడియో నిజంగా నచ్చిందని ఒకరు పేర్కొనగా.. జీవిత భాగస్వామిగా ఇలాంటి అమ్మాయి దొరికితే బాగుండు అంటూ మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి వారు కష్టసమయాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని.. అర్ధం చేసుకుంటారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్